China Virus: చైనాలో మరో భయంకరమైన వైరస్.. నెల రోజుల్లోనే 7వేల కేసులు

చైనా దక్షిణ ప్రాంతంలోని గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌ ఫోషన్‌ నగరంలో ప్రభుత్వం వైరస్‌పై యుద్ధం ప్రకటించింది. అక్కడ కొవిడ్‌ తరహాలో ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చింది. నెల రోజుల్లోనే 7,000 గన్యా కేసులు నమోదయ్యాయి.

New Update
China virus

చైనా దక్షిణ ప్రాంతంలోని గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌ ఫోషన్‌ నగరంలో ప్రభుత్వం వైరస్‌పై యుద్ధం ప్రకటించింది. అక్కడ కొవిడ్‌ తరహాలో ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చింది. నెల రోజుల్లోనే 7,000 గన్యా కేసులు(Ganya Cases) నమోదయ్యాయి. గత 20 ఏళ్లలో చైనాలో ఇంత వేగంగా వ్యాధి వ్యాపించడం ఇదే తొలిసారి. 2008లో ఈ స్థాయిలో వైరస్‌(New Virus) వ్యాపించింది. కోవిడ్ కంటే కూడా ఈ వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. దీంతో సైన్యాన్ని రంగంలోకి దింపి.. రక్షణచర్యలు చేపట్టింది.

Also Read :  'ట్రంప్‌ టారిఫ్‌లపై మోదీ అందుకే స్పందించడం లేదు'.. మరో బాంబు పేల్చిన రాహుల్‌గాంధీ

China Government Has Declared War

వైరస్‌(China Virus 2025) ని అంతం చేయడానికి వీధులను ఫాగింగ్‌తో పూర్తిగా క్రిమిసంహారకంగా చేస్తోంది. దోమలతో వైరస్‌కు చెక్ పెడతామనుకుంటున్నారు. దీంతో దోమలు పెరిగే ప్రదేశాలను గుర్తించేందుకు ప్రత్యేక డ్రోన్లను ప్రయోగిస్తున్నారు. ఇక పరిశోధకులు భారీ ఎలిఫెంట్ దోమలను కూడా రంగంలోకి దించారు. వీటితోపాటు దోమలను తినే ప్రత్యేక రకమైన 5,000 చేపలను కాల్వల్లోకి వదిలారు. వీటి అసలు పేరు ‘టెక్సోరెంకైటిస్‌’. ‘ఎలిఫెంట్‌ మస్కిటో’ అని కూడా అంటారు. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద దోమ జాతి ఇదే. అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా దేశాల్లో ఎక్కువగా జీవిస్తుంటాయి. వీటిల్లో దాదాపు  90 రకాలు ఉన్నాయి. 

Also Read :  ఇండియా మా ఫ్రెండే.. మీరే దొబ్బేయండి.. చైనా, పాక్ కు బంగ్లాదేశ్ బిగ్ షాక్!

వీటికి ప్రధానంగా అడవులే ఆవాసం. 18 మిల్లీమీటర్ల నుంచి 24 మిల్లీమీటర్ల వరకు పెరుగుతాయి. వీటిలో చాలారకాల వల్ల మనుషులకు ప్రమాదం లేదు. సాధారణంగా ఆడదోమలు మన రక్తాన్ని తాగుతాయి. కానీ చాలారకాల ఎలిఫెంట్‌ మస్కిటోలు ఆడవైనా సరే మొక్కలు, చెట్ల రసాలను పీల్చే బతుకుతాయి. వీటికి కార్బోహైడ్రేట్స్‌ ఉన్న ఆహారం అవసరం. రాత్రి వేళల్లో పడుకొంటాయి. వీటి ఆడదోమలు నీటి ఉపరితలం మీద గుడ్లు పెడతాయి. సాధారణ దోమలు కూడా ఇలాంటి ప్రదేశాల్లోనే సంతానోత్పత్తి చేస్తాయి. ఎలిఫెంట్‌ మస్కిటోల గుడ్ల నుంచి కేవలం 40 నుంచి 60 గంటల్లోనే లార్వాలు బయటకు వస్తాయి. అవి సమీపంలోని సాధారణ దోమల గుడ్లు తిని పెరుగుతాయి.  ఒక్క లార్వా కనీసం 100 దోమల గుడ్లను తింటుంది. దీంతో ఇతర దోమల సంతానం పెరగదు. 

Advertisment
తాజా కథనాలు