నడిరోడ్డుపై వధువు కిడ్నాప్.. ఊరేగింపు మధ్యలో ఎలా ఎత్తుకెళ్లారంటే?

పెళ్లయ్యాక అత్తమామల ఇంటికి వెళ్తున్న ఓ నవ వధువు‌ను ఆమె మాజీ ప్రియుడు కిడ్నాప్ చేశాడు. నడిరోడ్డు మీదనే కిడ్నాప్ చేయడంతో వరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు వధువుని వరుడికి అప్పగించి, దుండుగులను అదుపులోకి తీసుకున్నారు.

New Update
Rajastan Kidnap

Rajastan Kidnap Photograph: (Rajastan Kidnap)

నడిరోడ్డుపైనే వధువును కిడ్నాప్ చేసిన ఓ ఘటన రాజస్థాన్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. వరుడితో కలిసి అత్తమామల ఇంటికి ఓ నవ వధువు వెళ్తుండగా కొందరు దుండగులు వచ్చి ఆమెను కిడ్నాప్ చేశారు. ఒక బ్లాక్ స్కార్పియో మీద ఒక ఎనిమిది మంది దుండగులు వచ్చి ఆమెను కిడ్నాప్ చేశారు. 

ఇది కూడా చూడండి: ఐదో సారి తల్లి కాబోతున్న సీమా హైదర్... తండ్రిగా సచిన్ మీనాకు ప్రమోషన్ !

కారులోని మనుషులపై దాడి చేసి..

ఇంతటితో ఆగకుండా వరుడి కారు అద్దాలను పగలుగొట్టడంతో పాటు అందులో ఉన్న మనుషులపై కూడా దాడి చేశారు. వెంటనే వరుడు సమీపంలోని ధర్నావాడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వధువుని కిడ్నాప్ చేసిన వారిని పట్టుకోవడానికి మూడు పోలీసు బృందాలు బయలుదేరాయి. మూడు బృందాలు కలిసి వధువును ఛేజించారు. ఆ దుండగుడుని అదుపులోకి తీసుకుని, వధువుకుని కుటుంబ సభ్యులకు ఇచ్చారు. అయితే వధువుని కిడ్నాప్ చేసిన వాడు ఆమె మాజీ ప్రియుడిగా పోలీసులు గుర్తించారు. 

ఇది కూడా చూడండి: Blankets: దుప్పట్లు వాసన వస్తున్నాయా.. ఇలా చేస్తే సువాసన వెదజల్లుతాయి

ఇదిలా ఉండగా ప్రియుడితో కలిసి ఇల్లు కట్టుకునేందుకు.. సొంత బిడ్డనే కిడ్నాప్‌ మహిళ కిడ్నాప్ చేయించన ఘటన బిహార్‌లో జరిగింది. ఈ ఘటన బిహార్‌లోని ఛప్రా జిల్లాలో చోటుచేసుకుంది.  తన సొంత కుమారుడిని కిడ్నాప్‌ చేయించి కిడ్నాపర్లమని చెప్పించి రూ.25 లక్షలు డిమాండ్ చేసింది మహిళ. కుటుంబ సభ్యులు పోలీసులుకు ఫిర్యాదు చేయడంతో లోతుగా దర్యాప్తు చేపట్టారు.  

ఇది కూడా చూడండి: Oscar Awards 2025 : ఆస్కార్ అవార్డులు ప్రదానోత్సవం .. విజేతలు వీళ్లే!

పోలీసులు అనుమానంతో బబితా దేవిని విచారించగా..  తామే కిడ్నాప్‌ చేశామని విచారణలో అంగీకరించింది. దీంతో బబితా దేవితో పాటుగా  ఆమె ప్రియుడు నీతీశ్‌కుమార్‌ లను పోలీసులు అరెస్ట్ చేశారు. 13 ఏళ్ల బాలుడి మామ ఆదిత్య కుమార్ తన కిడ్నాప్ గురించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని సరన్ సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్‌ఎస్‌పి) కుమార్ ఆశిష్ తెలిపారు. రూ. 25 లక్షల ఇవ్వకపోతే  బాలుడిని చంపేస్తామని కిడ్నాపర్లమని చెప్పి బెదిరించినట్లుగా తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు