/rtv/media/media_files/2025/09/25/supreme-court-2025-09-25-16-02-18.jpg)
Supreme Court Allows Parents To Evict Children From Property If They Don’t Care For Them
సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పిల్లలు పట్టించుకోకపోతే వాళ్ల ఆస్తులు అనుభవించే హక్కు పిల్లలకు ఉండదని తేల్చిచెప్పింది. తల్లిదండ్రులను ఇలా పట్టించుకొని పిల్లలను బయటకు కూడా వెళ్లగొట్టచ్చని స్పష్టం చేసింది. బిడ్డలు పట్టించుకోని తల్లిదండ్రులకు 2007లో కేంద్రం తీసుకొచ్చిన తల్లిదండ్రుల, వృద్ధుల సంరక్షణ, పోషణ చట్టం అండగా ఉంటోందని పేర్కొంది.
Also Read: భారత రక్షణశాఖ మరో సంచలనం.. రైళ్ల నుంచి క్షిపణి దాడులు చేసే టెక్నాలజీ
మహారాష్ట్రకు చెందిన 80 ఏళ్ల వృద్ధ జంట.. కొడుకు తమ సంరక్షణ బాధ్యతలను చూసుకోవడం లేదని ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఈ సంచలన తీర్పునిచ్చింది. గతంలో కూడా కోర్టు ఇలాంటి తీర్పునే వెలువరించింది. తల్లిదండ్రుల సంరక్షణ, వారి పోషించే బాధ్యత కుమారులు, కూతుర్లదేనని స్పష్టం చేసింది. వాళ్లని పట్టించుకోకుండే ఆస్తి పొందే హక్కు ఉండదని హెచ్చరించింది.
Also Read: పహల్గాం ఉగ్రదాడిపై కీలక అప్‌డేట్.. ఉగ్రవాదులకు సాయం చేసిన నిందితుడు అరెస్టు
గతంలో మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వృద్ధ దంపతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమ కొడుకు వారి బాగోగులు చూసుకుంటానని చెప్పి.. మాట తప్పాడని పిటిషన్ వేశారు. దీంతో కోర్టు ఆ కొడుకుకి ఇచ్చిన ఆస్తిని రద్దు చేసింది. దానిపై ఆ వృద్ధ దంపతులకే హక్కును పునరుద్ధరించింది. తల్లిదండ్రుల సంరక్షణ, పోషణ చట్టం ప్రకారం ఏర్పాటైన ట్రైబ్యునళ్లు.. కన్నవాళ్లని పట్టించుకోని బిడ్డల విషయంలో వెంటనే దర్యాప్తు జరుపుతాయని పేర్కొంది. అంతేకాదు ఇలాంటి వివాదాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు బదిలీ చేసిన ఆస్తిపై మళ్లీ దాని యాజమాన్య హక్కులు పొందేలా ఆదేశించే అధికారం ట్రైబ్యునళ్లకు ఉంటుందని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.
The Supreme Court reiterated that a Tribunal under the Maintenance and Welfare of Parents and Senior Citizens Act, 2007, has the power to order the eviction of a child from the property of the senior citizen, if there is a breach of obligation to maintain the senior citizen.
— Live Law (@LiveLawIndia) September 25, 2025
Read… pic.twitter.com/Ti2LaYGGIH
Also Read: సొంత పౌరులపై పాక్ బాంబులు.. మరో 13 మందిని చంపి.. ఏం చేసిందంటే?