భారత రక్షణశాఖ మరో సంచలనం.. రైళ్ల నుంచి క్షిపణి దాడులు చేసే టెక్నాలజీ

భారత రక్షణశాఖ మరో పురోగతి సాధించింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఇంటర్మీడియట్ రేంజ్‌ అగ్నిప్రైమ్‌ మిసైల్‌ను సక్సెస్‌ఫుల్‌గా ప్రయోగించింది. ఈ క్షిపణిని రైలు నుంచే ప్రయోగించడం మరో విశేషం.

New Update
FotoJet (1DRDO carries out the successful launch of Intermediate Range Agni-Prime Missile from a Rail based Mobile launcher system  )

DRDO carries out the successful launch of Intermediate Range Agni-Prime Missile from a Rail based Mobile launcher system

భారత రక్షణశాఖ మరో పురోగతి సాధించింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఇంటర్మీడియట్ రేంజ్‌ అగ్నిప్రైమ్‌ మిసైల్‌ను సక్సెస్‌ఫుల్‌గా ప్రయోగించింది. ఈ క్షిపణిని రైలు నుంచే ప్రయోగించడం మరో విశేషం. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ ఈ విషయాన్ని ఎక్స్‌లో వెల్లడించారు. భారత్‌ రైలు ఆధారిత మొబైల్ లాంఛర్ సిస్టమ్‌ నుంచి మీడియం రేంజ్‌ అగ్నిప్రైమ్‌ మిసైల్‌ను విజయవంతంగా పరీక్షించిందని ఆయన రాసుకొచ్చారు. 

Also Read: పహల్గాం ఉగ్రదాడిపై కీలక అప్‌డేట్.. ఉగ్రవాదులకు సాయం చేసిన నిందితుడు అరెస్టు

ఈ క్షిపణికి దాదాపు 2 వేల కిలోమీటర్ల పరిధి సామార్థ్యం ఉందని తెలిపారు. రైలు ఆధారిత మొబైల్ లాంఛర్‌ నుంచి ఇలా క్షిపణిని ప్రయోగించడం ఇదే మొదటిసారని పేర్కొన్నారు. అలాగే ఈ పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన DRDOకు అభినందనలు తెలియజేశారు. అలాగే స్ట్రాటజిక్‌ ఫోర్సెస్‌ కమాండ్ (SFC), సాయుధ దళాలలను కూడా అభినందించారు.  

Also Read: పుణె యూనివర్సిటీకి రూ.2.46 కోట్ల కుచ్చుటోపీ.. తెలుగు ఇంజినీర్‌ అరెస్టు

అగ్ని-ప్రైమ్ క్షిపణి లక్షణాలు 

అగ్నిప్రైమ్ మిసైల్‌ 2 వేల కిలోమీటర్ల పరిధి వరకు వెళ్లి శత్రువులపై దాడులు చేయగలదు. అలాగే ఇది రైలు నెట్‌వర్క్ వెంట ప్రయాణించగలదు. చాలా తక్కువ సమయంలోనే దేశంలో ఏ సరిహద్దుకైనా వేగంగా వెళ్లగలదు. అంతేకాదు దీనికి శత్రువుల రాడర్‌ నుంచి తప్పించుకునే సామార్థ్యం కూడా ఉంది. ఈ మిసైల్‌లో నావిగేషన్ సిస్టమ్‌ అత్యంత అధునాతనంగా అమర్చారు. దీనివల్ల శత్రు స్థావరాలను ఇది అత్యంత కచ్చితత్వంతో దాడులు చేయగలదు.  

Advertisment
తాజా కథనాలు