/rtv/media/media_files/2025/03/22/zwNIcnuVSnmgdBBkRRkf.jpg)
Narayana Murthi and Sudha Murthi
ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణమూర్తి వారానికి 70 గంటల పాటు పనిచేయాలని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై తాజాగా ఆయన భార్య, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి స్పందించారు. ఏదైనా పనిని ఇష్టంతో, ఉత్సహంగా చేస్తే సమయం పరిమితంగా మారదని చెప్పారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యులో ఆమె మాట్లాడారు. '' ప్రజలు ఏదైనా పనిని ఇష్టంతో, ఉత్సహంగా చేస్తే దాని సమయానికి లిమిట్ ఉండదు.
Also Read: డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా JAC మీటింగ్.. సీఎం స్టాలిన్, రేవంత్ ఏమన్నారంటే ?
నా భర్త వద్ద డబ్బులు లేని సమయంలో కూడా ఇన్ఫోసిస్‌ను నిర్మించాలని అనుకున్నారు. ఆ సమయంలో అంకితభావం కలిగిన వ్యక్తులతో 70 గంటలు అంతకన్నా ఎక్కువగా పనిచేయడం వల్లే ఇది సాధ్యమయ్యింది. కేవలం నా భర్త మాత్రమే కాదు. జర్నలిస్టులు, డాక్టర్లు వంటి ఇతర రంగాల్లో ఉన్నవారు కూడా 90 గంటల వరకు పనిచేస్తున్నారు. భగవంతుడు అందరికీ రోజుకి 24 గంటల సమయమే ఇచ్చారు. మీరు దాన్ని ఎలా వినియోగించుకుంటారనేది మీ ఇష్టమని'' సుధామూర్తి అన్నారు.
Also Read: నేడు వరల్డ్ ఎర్త్ అవర్ డే.. రాత్రి 8.30 నుంచి 9.30 మర్చిపోవద్దు
మరోవైపు సుధాముర్తి తన వ్యక్తిగత జీవితం గురించి కూడా మాట్లాడారు. '' ఇన్ఫోసిస్‌ను నారాయణమూర్తి చూసుకునేటప్పుడు నేను ఇంటి భాధ్యతలు తీసుకున్నాను. ఇంటిని చూసుకోవడంతో పాటు పిల్లలను పెంచడం, కళాశాలలో కంప్యూటర్ సైన్స్ బోధించాను. ప్రస్తుతం నేను నా భర్త కంటే ఓవర్ టైమ్ పనిచేస్తున్నాను. దీనికి ఆయన సపోర్ట్‌గా ఉన్నారు. ప్రతి మహిళ విజయం వెనుక అర్థం చేసుకునే వ్యక్తి ఉంటారు. వృత్తి జీవితంలో భార్యాభర్తలిద్దరు ఒకరికొకరు సాయం చేసుకోవాలి. అదే జీవితమని'' సుధామూర్తి అన్నారు.
Also Read: వేలంలో ట్విట్టర్ పాత లోగో.. భారీ ధర పలికిన ఐకాన్
Also Read: భయ్యా సన్నీ యాదవ్‌కు బిగ్ షాక్.. లుక్ ఔట్ నోటీసులు జారీ
infosys | sudha-murthy | telugu-news | rtv-news