BIG BREAKING: భయ్యా సన్నీ యాదవ్‌కు బిగ్ షాక్.. లుక్ ఔట్ నోటీసులు జారీ

బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో భయ్యా సన్నీయాదవ్‌పై ఇప్పటికే నూతనకల్ పీఎస్‌లో కేసునమోదు అయిన విషయం తెలిసిందే. తాజాగా అతడికి బిగ్‌షాక్ తగిలింది. సన్నీయాదవ్ విదేశాల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగానే అతడిపై పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు.

New Update
YouTuber bayya Sunny Yadav lookout notice by Police for betting app case

YouTuber bayya Sunny Yadav lookout notice by Police for betting app case

బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో భయ్యా సన్నీయాదవ్‌పై ఇప్పటికే నూతనకల్ పీఎస్‌లో కేసునమోదు అయిన విషయం తెలిసిందే. తాజాగా అతడికి బిగ్‌షాక్ తగిలింది. సన్నీయాదవ్ విదేశాల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగానే అతడిపై పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. 

మైనంపల్లి ఫిర్యాదు

మరోవైపు ఇప్పటి వరకు బెట్టింగ్ యాప్‌ ప్రమోట్ చేసిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ వ్యవహారంలో ఉండి ఇప్పటి వరకు కేసులు కాని వాళ్లకు బిగ్ షాక్ తగలనుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి.. ఇంకా కేసు కాకుండా ఉన్న వారిపై పోలీసులు కేసులు పెట్టనున్నారు. ఇందులో భాగంగానే మల్కాజ్‌గిరి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు నేరెడ్‌మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read: మరో విమానంలో అమెరికా నుంచి అక్రమ వలసదారుల రాక..ఈసారి ఎంతమంది వస్తున్నారంటే..?

బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న వాళ్లు.. ఎంత పెద్దవారైనా వదలొద్దని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వినయ్ కుయ్యా, శివజ్యోతి, డేర్‌స్టార్‌ గోపాల్‌, శ్రీధర్ చాప, విజ్జుగౌడ్‌పై కేసు నమోదు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. చూడాలి మరి ఈ బెట్టింగ్ యాప్స్ కాంట్రవర్సీ ఎంతవరకు వెళ్తుందో.

ఇదిలా ఉంటే బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు చేసిన సెలబ్రెటీలకు తెలంగాణ పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. ఇటీవల యాంకర్ విష్ణుప్రియతో పాటు మొత్తం 11 మంది సెలబ్రెటీలకు పంజాగుట్ట పోలీసులు నోటీసులు ఇచ్చారు. అంతేకాకుండా మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో సైతం కేసులు నమోదు అయ్యాయి.

11 గంటల పాటు విచారణ

టాలీవుడ్ సినీ హీరో, హీరోయిన్లపై కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో విష్ణుప్రియ తన లాయర్‌తో కలిసి పంజాగుట్ట పీఎస్ కు విచారణకు హాజరయ్యారు. ముఖం కనిపించకుండా తలకు స్కార్ఫ్ తో విష్ణుప్రియ విచారణకు హాజరయ్యారు. దాదాపు 11 గంటల పాటు విష్ణుప్రియను పోలీసులు విచారించారు. 

Also Read: కర్నూలులో దారుణ హత్య. వేట కొడవళ్లతో వెంబడించి.. షాకింగ్ వీడియో!

ఈ విచారణలో ఆమె బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేశానని ఒప్పుకున్నారు. 3 యాప్స్‌కు తాను ప్రమోషన్స్ చేశానని విచారణలో చెప్పుకొచ్చారు. దీంతో 25వ తేదీన పోలీసులు మరోసారి విచారణకు హాజరుకావాలని చెప్పారు. విచారణ అనంతరం బయటకొచ్చిన విష్ణుప్రియ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

అన్నింటికి సమాధానం

ఈ మేరకు తన ఇన్‌స్టాలో సంచలన పోస్టు పెట్టారు. అందులో ‘‘Only Time Can Answer.. Only Patience Till Then’’ (కాలం అన్నింటికీ సమాధానం చెబుతుంది.. అప్పటి వరకు ఓపికతో ఉండాలి) అంటూ ఆ స్టోరీలో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ పోస్టుపై నెటిజన్లు కంగుతిన్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు