/rtv/media/media_files/2025/03/22/03nOaIJ5gIHc505UyfrI.jpg)
Twitter old Logo
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌కు చెందిన పాత ఐకానిక్ లోగో అందరికి గుర్తుండే ఉంటుంది. బ్లూ కలర్‌లో ఓ బుల్లి పిట్ట ఆకారంలో ఉంటుంది. ఆ పిట్టబొమ్మ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంది. అయితే ఈ పాత ట్విట్టర్ లోగో బ్లూ బర్డ్‌ను వేలంలో వేశారు. దీంతో అది భారీ ధర పలికింది. ఆర్ఆర్ ఆక్షన్ అనే సంస్థ నిర్వహించిన వేలం పాటలో ఈ పిట్ట లోగో 35 వేల డాలర్లకు అమ్ముడైపోయింది.
Also Read: ఇస్తే తీసుకుంటా...అధ్యక్ష పదవిపై బండి సంజయ్ హాట్ కామెంట్స్!
భారత కరెన్సీలో చూసుకుంటే దీని ధర దాదాపు రూ.30 లక్షలకు పైగానే ఉది. అయితే వేలంలో దీన్ని దక్కించుకున్న వ్యక్తి వివరాలు మాత్రం ఆ ఆక్షన్ సంస్థ చెప్పలేదు. ఇదిలాఉండగా.. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ట్విట్టర్ హెడ్‌క్వార్టర్ బిల్డింగ్ గోడపై బ్లూ బర్డ్ ఉండేదన్న సంగతి తెలిసిందే. ఇది 12 అడుగుల పొడవు, 9 అడుగుల వెడల్పు, 254 కేజీల బరువు ఉండేది. అయితే 2022 అక్టోబర్‌లో ట్విట్టర్‌ను ఎలాన్ మస్క్ కొన్నారు. ఒక్కో స్టాక్‌కు 54.20 డాలర్ల చొప్పున 44 బిలియన్ డాలర్లు చెల్లించారు.
Also Read: డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా JAC మీటింగ్.. సీఎం స్టాలిన్, రేవంత్ ఏమన్నారంటే ?
దీన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత అందులో ఎలాన్ మస్క్ అనేక మార్పులు చేస్తూ వచ్చారు. సంస్థ పేరును ట్విట్టర్ నుంచి ఎక్స్‌గా మార్చారు. అలాగే ట్విట్టర్ పాత లోగో అయిన పిట్ట స్థానంలో ఎక్స్ (X)ను చేర్చారు. అంతేకాదు ఆ సంస్థలో పనిచేసే 75 శాతం మంది ఉద్యోగులను కూడా తొలగించారు. కంటెంట్ విషయంలో చాలా మార్పులు తీసుకొచ్చారు. అయితే ట్వి్ట్టర్ పాత జ్ఞాపకమైన ఐకానిక్ బ్లూ బర్డ్ లోగోను అమ్మేశారు. అయితే తాజాగా ఆర్ఆర్ ఆక్షన్ అనే సంస్థ నిర్వహించిన వేలం పాటలో ఈ పిట్ట లోగో 35 వేల డాలర్లకు అమ్ముడైపోయింది.
Also Read: భారత్‌లో ఎక్స్ గ్రోక్ తిట్ల వివాదం.. స్పందించిన ఎలాన్ మస్క్
telugu-news | national-news | rtv-news