పహల్గామ్ ఉగ్రదాడి చేసి అనవసరంగా నెత్తి మీదకు తెచ్చుకుది పాకిస్తాన్. తమతో పెట్టుకుంటే ఎంత తీవ్రంగా ఉంటుందో భారత్ కొట్టి మరీ చూపిస్తోంది. ఇప్పటికే సింధుజలాలు, దౌత్య పరమైన నిర్ణయాలు, ఎయిర్ స్ట్రైక్, మీడియా కట్ వంట వాటితో పాక్ కు చుక్కలు చూపిస్తున్న భారత ప్రభుత్వం ఇప్పుడు ఆ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో మొదటి ప్లాన్ పాకిస్తాన్ ను మళ్ళీ ఫైనాన్షయల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ -ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్ట్‌లోకి తీసుకురావడం. దీంతో అంతర్జాతీయంగా ఆ దేశానికి అందే ఆర్థిక సహాయం నిలిచిపోతుంది. ఇక రెండోది పాకిస్తాన్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి-ఐఎంఎఫ్ అంగీకరించిన 7 బిలియన్ డాలర్ల రుణాన్ని నిలిపివేసేలా ఒత్తిడి తీసుకురావడానికి భారత్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.
షాక్ ల మీద షాకులు ఇవ్వడానికి రెడీ అవుతున్న భారత్..
పాకిస్తాన్ కు ఇలాంటి దెబ్బలు ఇంతకు ముదే అనుభవం ఉన్నాయి. 2018లో ఉగ్రవాదులకు పాకిస్తాన్ నిధులు ఇస్తోందనే ఆరోపణలతో గ్లోబల్ మనీలాండరింగ్ టెర్రర్ ఫైనాన్సింగ్ వాచ్‌డాగ్.. గ్రే లిస్ట్‌లో పెట్టింది. దీంతో ఆ దేశానికి అంతర్జాతీయంగా డబ్బులు రావడం ఆగిపోయింది. దాంతో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడింది. అప్పుడు దెబ్బకు దిగివచ్చింది పాక్. ఉగ్రవాదులకు అందే నిధులు అరికట్టేందుకు తమ దేశం అన్ని విధాల కట్టుబడి ఉందని ప్రకటించుకుంది. దీని కారణంగా 2022లో పాక్ ను గ్రే లిస్ట్ నుంచి తొలగించారు. ఇప్పుడు మళ్ళీ ఇదే పని చేస్తే..ఇప్పటికే ఆర్థికంగా బాగా చితికిపోయిన పాకిస్తాన్ మీద మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు అవుతుంది. అంతర్జాతీయ నిధులు అందక గిలగిల కొట్టుకుంటుంది. అందుకే భారత్ ఎలా అయినా పాక్ ను గ్రే లిస్ట్ నుంచి తొలగించేలా చేయాలని తె ప్రయత్నాలు చేస్తోంది.
today-latest-news-in-telugu | pakistan | india on pahalgam attack
Also Read: Air India: రూటు మార్చుకున్న ఎయిర్ ఇండియా...అమెరికాకు మరో రూట్ లో..