Stray Dogs Attack In Delhi: ఢిల్లీలో కెన్యా, జపాన్‌ దేశాల కోచ్‌లపై వీధి కుక్కల దాడి

ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ల ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. టోర్నమెంట్‌కు వచ్చిన కెన్యా, జపాన్ దేశాల కోచ్‌లపై వీధికుక్కలు దాడి చేశారు. అథ్లెట్లు, సహాయక సిబ్బంది భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

author-image
By K Mohan
New Update
Stray dog bites

ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ల ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు వచ్చిన కెన్యా దేశానికి చెందిన కోచ్‌ను స్టేడియం ప్రాంగణంలో వీధికుక్క(Delhi in Stray Dogs) కరిచింది. ఈ ఘటనతో అథ్లెట్లు, సహాయక సిబ్బంది భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కెన్యా స్ప్రింట్స్ కోచ్ అయిన డెన్నిస్ మరాగియా మ్వాన్జో శుక్రవారం ఉదయం వార్మప్ ట్రాక్‌పై తమ అథ్లెట్లకు శిక్షణ ఇస్తుండగా ఈ దాడి జరిగింది. అథ్లెట్ స్టార్టింగ్ బ్లాక్స్‌ను సరిచేస్తుండగా, వీధికుక్క వెనుక నుండి వచ్చి ఆయన కుడి కాలి పిక్కపై కరిచింది. వెంటనే రక్తస్రావం కావడంతో అక్కడే ఉన్న మెడికల్ టీమ్ స్పందించి ఆయనకు ప్రథమ చికిత్స అందించింది. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆయనను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. అతనికి యాంటీ-రేబిస్ వ్యాక్సిన్ ఇతర చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం.

Also Read :  హ్యాట్సాఫ్.. యుద్ధంలో అన్న వీరమరణం...చెల్లికి దగ్గరుండి పెళ్లి చేసిన తోటి సైనికులు!

జపాన్ కోచ్‌పై దాడి

ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, కేవలం కెన్యా కోచ్‌పై మాత్రమే కాక, అంతకు కొద్దిసేపటికే జపాన్ పారా అథ్లెటిక్స్ అసిస్టెంట్ కోచ్ మెయికో ఓకుమాట్సు పైనా కూడా వీధికుక్క దాడి చేసింది. ఆమె ఎడమ కాలి పిక్కపై తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనలన్నీ స్టేడియం వార్మప్ ట్రాక్‌లోనే అరగంట వ్యవధిలో జరిగాయి. ఈ రెండు ఘటనలతో పాటు ఓ సెక్యూరిటీ గార్డును కూడా వీధికుక్క కరిచినట్లు నిర్వాహక వర్గాలు తెలిపాయి.

Also Read :  అలెర్ట్.. రెండేళ్ల లోపు చిన్నారులకు ఆ మందులు వాడొద్దు

ఈ సంఘటనలపై స్పందించిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ ఆర్గనైజింగ్ కమిటీ స్టేడియం ప్రాంగణంలోకి వీధికుక్కలు రాకుండా ఉండేందుకు మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీకి ముందే విజ్ఞప్తి చేశామని తెలిపింది. ఛాంపియన్‌షిప్‌లు ప్రారంభం కావడానికి ముందే MCD ప్రాంగణాన్ని శుభ్రం చేసిందని, అయినప్పటికీ, స్టేడియం సమీపంలో ప్రజలు కుక్కలకు ఆహారం వేయడంతో అవి మళ్లీ లోపలికి ప్రవేశిస్తున్నాయని కమిటీ పేర్కొంది.

విదేశీ అథ్లెట్లు, కోచ్‌లకు భద్రత అత్యంత ముఖ్యమని కెన్యా టీమ్ వైద్యుడు మైఖేల్ ఒకారో ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ఈ ఘటన తర్వాత స్టేడియంలో వీధికుక్కలను పట్టుకోవడానికి రెండు ప్రత్యేక బృందాలను MCD ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ ఈవెంట్‌లో ఇలాంటి సంఘటనలు జరగడం ఢిల్లీలో వీధికుక్కల సమస్య తీవ్రతను మరోసారి వెలుగులోకి తెచ్చింది.

Advertisment
తాజా కథనాలు