Cough Syrup: అలెర్ట్.. రెండేళ్ల లోపు చిన్నారులకు ఆ మందులు వాడొద్దు

కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. రెండేళ్లలోపు చిన్నారులకు దగ్గుమందు వాడకూడదని సూచించింది. రెండు నుంచి ఐదేళ్ల వరకు పిల్లలకు మాత్రం అత్యవరమైతేనే పరిమితంగా దగ్గు మందు వాడలని చెప్పింది.

New Update
Centre advises against prescribing cough syrups to children below 2 years

Centre advises against prescribing cough syrups to children below 2 years

ఇటీవల మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లోని చింద్వారా జిల్లాలో దగ్గు మందు తాగిన తర్వాత పలువురు మంది చిన్నారులు మృతి చెందడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర ప్రభుత్వ కీలక ఆదేశాలు జారీ చేసింది. రెండేళ్లలోపు చిన్నారులకు దగ్గుమందు వాడకూడదని సూచించింది. రెండు నుంచి ఐదేళ్ల వరకు పిల్లలకు మాత్రం అత్యవరమైతేనే పరిమితంగా దగ్గు మందు వాడలని చెప్పింది. ఇక వివరాల్లోకి వెళ్తే సెప్టెంబర్ 7 నుంచి 20వ తేదీ మధ్య చింద్వారా జిల్లాలో కిడ్నీ ఫెయిల్ అయ్యి 9 మంది చిన్నారులు మృతి చెందారు. రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలో కూడా ఇలాంటి మరణాలు సంభవించాయి. వీళ్లలో ఐదుగురు కోల్డ్‌రెఫ్‌, మరొకరు నెక్స్‌ట్రో సిరప్ తీసుకున్నట్లు పరీక్షల్లో తేలింది. 

Also Read: దసరాకు దుమ్ములేపిన మందుబాబులు.. ఎక్సైజ్ శాఖకు ఎన్ని కోట్ల ఆదాయం వచ్చిందో తెలుసా?

Centre Advises Against Cough Cyrup

ఈ క్రమంలోనే అలెర్ట్ అయిన కేంద్రం.. ఈ సిరప్‌లపై అత్యవసర పరిశోధనలు ప్రారంభించింది. నేషనల్ సెంటర్ ఫర్‌ డిసీస్‌ కంట్రోల్, ది సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌, ఇతర ఏజెన్సీలు చింద్వారా జిల్లాలో పర్యటన చేశాయి. చనిపోయిన చిన్నారులు వాడిన దగ్గు మందు శాంపిళ్లను పరిశీలించాయి. అయితే ఆ మందులు కలుషితం కాలేదని తేలింది. అంతేకాదు వాటిలో హానికరమైన డీఎథిలీన్ గ్లైకాల్, ఎథిలీన్ గ్లైకాల్‌ లాంటి కిడ్నీలకు హానీ కలిగించే రసాయనాలు లేవని తెలిపాయి. అయినప్పటీకీ చిన్నారులకు దగ్గు మందును పరిమితంగా వాడాలని DCGA ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు దగ్గు మందు తీసుకోవడంపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం సైతం అలెర్ట్ అయ్యింది. జలుబు, జ్వరంతో వచ్చే చిన్నపిల్లలకు సొంతంగా చికిత్స చేయకూడదని.. ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించింది. 

Also Read: పవన్‌ కళ్యాణ్, రిషబ్‌ షెట్టికి షాక్.. ఆ దేశంలో సౌత్ ఇండియన్ సినిమాలు నిలిపివేత

Advertisment
తాజా కథనాలు