/rtv/media/media_files/2025/09/14/ilayaraja-2025-09-14-07-00-30.jpg)
Ilayaraja
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కీలక ప్రకటన చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు భారతరత్న పురస్కారం కోసం ప్రతిపాదించనున్నామని పేర్కొన్నారు. ఇళయరాజా సీని ఇండస్ట్రీలోకి వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం చెన్నైలో శనివారం ఆయనకు సన్మాన కార్యక్రమం జరిపింది. ఇళయరాజాను సీఎం స్టాలిన్ జ్ఞాపికతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. '' కృషి, నైపుణ్యాలు ఉంటే ఏమైనా సాధించవచ్చని ఇళయరాజా నిరూపిస్తున్నారు.
Also Read: కుక్కలు మాత్రమే వాళ్ళకు జంతువులు..వైరల్ అవుతున్న ప్రధాని వ్యాఖ్యలు
సంగీతం ఆయనకు తల్లిగా జోల పాడుతోంది. ప్రేమ భావోద్వేగాలను కీర్తిస్తూ విజయానికి ప్రేరణగా నిలుస్తోంది. బాధలను ఓదార్చుతోంది. ఇకనుంచి ప్రతి సంవత్సరం సంగీత కళాకారులను ప్రోత్సహించేలా తమిళనాడు సర్కార్ తరఫున ఇళయరాజా పేరుతో పురస్కారం అందిస్తాం. అంతేకాదు ఆయనకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని రాష్ట్ర ప్రజలు, సంగీత ప్రేమికుల తరఫున కేంద్రానికి ప్రతిపాదించనున్నామని'' స్టాలిన్ అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, మంత్రి సామినాథన్ సహా నటులు రజనీకాంత్, కమల్‌హాసన్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: మరోసారి రష్యా, చైనాలపై ట్రంప్ టారిఫ్ బాంబులు.. NATO సభ్యదేశాలకు లేఖ
ఇళయరాజా1943లో తమిళనాడులోని పన్నైపురం గ్రామంలో పేద కుటుంబంలో జన్మించారు. ఆయన అసలు పేరు జ్ఞానదేశికన్. చిన్నతనం నుంచే ఆయనకు జానపద పాటలపై ఆసక్తి ఉండేది. మొదటగా తన సోదరుడు పావళర్ వరదరాజన్ టీమ్‌తో కలిసి వివిధ గ్రామాల్లో జానపద పాటలు పాడేవారు. నాటకాలు వేసేవారు. 1968లో చెన్నైకి ఆయన సంగీతం నేర్చుకోవడానికి వచ్చారు. అనంతరం ప్రముఖ సంగీత దర్శకుడు జి.కె.వెంకటేశ్ వద్ద అసిస్టెంట్‌గా చేరారు.
Also Read: ఇన్‌స్టా, X అకౌంట్లు ఆధార్‌తో లింక్ చేయాలి.. టాలీవుడ్ హీరో వివాదాస్పద వ్యాఖ్యలు
1976లో 'అన్నకిళి' అనే తమిళ సినిమాతో ఇళయరాజా సంగీత దర్శకుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఈ సినిమాలో ఆయన అందించిన పాటలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. అప్పుడే ఆయనకు మంచి సంగీత దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు ఆయన కర్ణాటక సంగీతాన్ని, జానపద గీతాలను, పాశ్చాత్య ఆర్కెస్ట్రాని కలిపి కొత్త రకం సంగీతాన్ని అందించి రికార్డు సృష్టించారు. లండన్‌లోని రాయల్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రాతో సింఫనీని రికార్డ్ చేసిన తొలి ఆసియా సంగీత దర్శకుడు కూడా ఇళయరాజానే కావడం మరో విశేషం. ఆయనకు ఉత్తమ సంగీత దర్శకుడిగా 5 సార్లు జాతీయ అవార్డు వచ్చింది. అలాగే భారత ప్రభుత్వం ఆయన్ని 2010లో పద్మ భూషణ్, అలాగే 2018లో పద్మ విభూషణ్ పురస్కారాలతో సత్కరించించింది.
Also Read: గాజాలో ఆగని మృత్యుఘోష...ఇజ్రాయెల్ దాడుల్లో 32 మంది మృతి