ఇన్‌స్టా, X అకౌంట్లు ఆధార్‌తో లింక్ చేయాలి..  టాలీవుడ్ హీరో వివాదాస్పద వ్యాఖ్యలు

టాలీవుడ్ హీరో సాయి దుర్గా తేజ్ ఓ ఇంటర్వ్యూలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చిన్న పిల్లల ఎక్స్‌, ఇన్‌స్టా ఖాతాలను ఆధార్‌‌తో లింక్ చేయాలని ఆయన సూచించారు. ఆధార్ కార్డ్‌కు లింకు చేయడంతో పిల్లలు, తల్లిదండ్రుల్లో భయం పెరుగుతుందని అన్నారు.

New Update
sai tej

టాలీవుడ్ హీరో సాయి దుర్గా తేజ్ ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. చిన్న పిల్లల ఎక్స్‌, ఇన్‌స్టా ఖాతాలను ఆధార్‌ నెంబర్‌తో అనుసంధానం చేయాలని ఆయన సూచించారు. అభయం మసూమ్‌-25లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆధార్ కార్డ్‌కు లింకు చేయడంతో పిల్లలు, తల్లిదండ్రుల్లో భయం పెరుగుతుందని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో పిల్లల పట్ల అశ్లీలత, అసభ్యతను తగ్గించాలంటే ఆధార్ కార్డు జత చేయడం తప్పనిసరి చేయాలని అభిప్రాయపడ్డారు. మొబైల్ ఫోన్ల వాడకం, సోషల్ మీడియా వల్ల యువతలో పెరిగిపోతున్న అనైతిక ప్రవర్తన, ఇబ్బందులపై సాయి తేజ్ ఆందోళన వ్యక్తం చేశారు. 

ప్రభుత్వ గుర్తింపు ఉన్న కార్డ్‌లో సోషల్ మీడియా ఖాతాలు లింక్ చేస్తే తల్లిదండ్రులకు తమ పిల్లల ఆన్‌లైన్ కార్యకలాపాలపై మరింత పర్యవేక్షణ ఉంటుందని ఆయన అన్నారు. అలాగే పిల్లలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వాటి పట్ల మరింత బాధ్యతాయుతంగా ఉంటారు. తప్పుడు అకౌంట్లు, సైబర్ బెదిరింపులు, ట్రోలింగ్ వంటి సమస్యలను కొంతవరకు అరికట్టవచ్చని సాయి తేజ్ చెప్పారు. అసభ్యకరమైన, హింసాత్మక కంటెంట్‌కు దూరంగా ఉండడానికి సహాయపడుతుంది.

ఈ ఆలోచన వెనుక ఉన్న కారణాలు
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ వినియోగదారుల వయసు నిర్ధారణకు కఠినమైన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. దీంతో మైనర్లు సులభంగా నకిలీ వయసును నమోదు చేసి అకౌంట్లను క్రియేట్ చేస్తున్నారు. దీనివల్ల వారు ఆన్\u200cలైన్ వేధింపులకు గురవడమే కాకుండా, తామే ఇతరులను వేధించడానికి కూడా కారణమవుతున్నారు. ఈ నేపథ్యంలో, ఆధార్‌తో అనుసంధానం చేయడం వల్ల ఈ సమస్యలకు కొంత పరిష్కారం దొరుకుతుందని సాయి తేజ్ అభిప్రాయపడ్డారు. అయితే, ఈ సూచనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది దీనిని గోప్యతా హక్కులకు భంగం కలిగించే చర్యగా చూస్తున్నారు. కానీ, యువత భద్రత దృష్ట్యా ఇది అవసరమేనని చాలామంది మద్దతు తెలుపుతున్నారు.