/rtv/media/media_files/2025/05/03/YvdkNrJn9gJyJot9emZ9.jpg)
Pahalgam attack
పహల్గాం ఉగ్రదాడి ఘటన భారత్‌తో పాటు ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నారనేదే ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. అయితే తాజాగా ఓ కీలక అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. పహల్గాంలో కాల్పులు జరిపిన ఉగ్రవాదులు శ్రీలంక రాజధాని కోలంబో చేరుకున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి.
Also Read: నాకు ఒక్క అవకాశం ఇస్తే.. పహల్గాం టెర్రర్ అటాక్‌పై కేఎ పాల్ సంచలన వ్యాఖ్యలు
Pahalgam Attack Suspects
ఇక వివరాల్లోకి వెళ్తే.. కొలంబో ఎయిర్‌పోర్టులో భారీ సెర్చ్ ఆపరేషన్ జరిగింది. చెన్నై నుంచి కొలంబో వెళ్లిన విమానంలో ఎయిర్‌పోర్ట్ సిబ్బంది, స్థానిక పోలీసులు ఈ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. భారత్ నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ సోదాలు నిర్వహించారు. అయితే శ్రీలంక ఎయిర్‌లైన్స్‌కు చెందిన యూఎల్ 122 విమానంలో చేపట్టిన తనిఖీల్లో ఆరుగురు అనుమానితులు పట్టుబడ్డారు. వాళ్లని తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పహల్గాం దాడికి వాళ్లతో సంబంధం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read : RCB Vs CSK: షెపర్డ్ షేక్.. ఆర్సీబీ ఇచ్చిన టార్గెట్‌కు సీఎస్కేకు చెమటలే
మరోవైపు పహల్గాం ఉగ్రదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఇప్పటికే దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా 2023లో రాజౌరిలో ఉగ్రదాడి కేసులో అరెస్టయిన ఇద్దరు ఖైదీలను విచారణ చేసింది. ప్రస్తుతం జమ్మూలోని కోట్ భల్వాల్ జైల్లో ఉన్న లష్కరే తోయిబా ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ నిస్సార్ అహ్మద్, అలాగే ముస్తాక్ హుస్సేన్‌ను ప్రశ్నించింది. పహల్గాం ఉగ్రదాడికి వీళ్లకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా ? అనే అనుమానంతో విచారణ చేసినట్లు తెలుస్తోంది.
Also Read: పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం.. ప్రజల దృష్టి మార్చేందుకే ఉగ్రదాడికి దిగిందా ?
ఇక పహల్గాం ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబా, పాక్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ హస్తం ఉన్నట్లు NIA ప్రాథమిక దర్యాప్తులో తేలింది. లష్కరే తోయిబా ఉగ్రవాదులే ఈ దాడి చేశారని పేర్కొంది. పాకిస్థాన్‌లోని లష్కరే హెడ్‌క్వార్టర్స్‌లోనే ఈ దాడికి ప్లాన్ వేసినట్లు చెప్పింది.
Also Read : ఐపీఎల్ 2025లో షెపర్డ్ మైండ్ బ్లోయింగ్ రికార్డ్.. 14 బంతుల్లో హాఫ్ సెంచరీ
telugu-news | rtv-news | national-news | Pahalgam attack