Kohli: విరాట్‌ను అవమానించిన ఆసీస్ మీడియా.. ఆ పేరుతో హెడ్ లైన్స్!

ఆస్ట్రేలియా మీడియా మరోసారి విరాట్ కోహ్లీపై విషం చిమ్మింది. మెయిన్‌స్ట్రీమ్ మీడియా తమ వార్త పేపర్స్, వెబ్ సైట్లలో కోహ్లీని అవమానపరిచే వ్యాఖ్యలతో హెడ్ లైన్స్ ప్రచురించింది. 'చోక్లీ', ‘క్లౌన్‌ కోహ్లీ’ అంటూ జోకర్‌గా పేర్కొంటూ వికృత బుద్ధి చూపించింది. 

author-image
By srinivas
New Update
kohli australia

kohli australia Photograph: (kohli australia)

Virat kohli: ఆస్ట్రేలియా మీడియా మరోసారి విరాట్ కోహ్లీపై విషం చిమ్మింది. మెయిన్‌స్ట్రీమ్ మీడియా తమ వార్త పేపర్స్, వెబ్ సైట్లలో కోహ్లీని అవమానపరిచే వ్యాఖ్యలతో హెడ్ లైన్స్ ప్రచురించింది. 'చోక్లీ', ‘క్లౌన్‌ కోహ్లీ’ అంటూ జోకర్‌గా పేర్కొంటూ వికృత బుద్ధి చూపించింది. 

సోషల్ మీడియాలో 'చోక్లి' ట్రెండ్..


బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇరుజట్లమధ్య మెల్‌బోర్న్‌ వేదికగా నాలుగో టెస్ట్ నడుస్తోంది. అయితే మొదటిరోజు ఆటలో కొత్తగా జట్టులోకి వచ్చిన ఆస్ట్రేలియా యంగ్ ప్లేయర్ సామ్ కాన్ స్టాన్, కోహ్లీ మధ్య వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. కాగా దీనిని దృష్టిలో పెట్టుకుని ఆస్ట్రేలియా వార్త పత్రికలు కోహ్లీని టార్గెట్ చేస్తూ వార్తలు రాసుకొచ్చాయి. ఐసీసీ కోహ్లీకి 20 శాతం జరిమానా విధించినప్పటికీ తమ బుద్ది చూపించుకున్నాయి. కోహ్లీ యాంటీ ఫ్యాన్స్ 'చోక్లి' అనే పదాన్ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. అంతేకాదు ‘క్లౌన్‌ కోహ్లీ’ అంటూ జోకర్ తో పోలుస్తూ ఫొటో, హెడ్ లైన్స్ ప్రచురించడంపై భారతీయులు మండిపడుతున్నారు. 

కోహ్లీ నా ఫేవరెట్ ప్లేయర్.. 


ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా బ్యాటర్ సామ్ కాన్ స్టాన్ ఈ ఘటన అనుకోకుండా జరిగిందన్నాడు. కోహ్లీని తాను గమనించలేదని చెప్పాడు. విరాట్ తన ఫేవరెట్ ప్లేయర్ అన్నాడు. ఇది పెద్ద సమస్య కాదని, క్రికెట్ లో ఇదంతా సర్వ సాధారణమేనని చెప్పాడు. అయినప్పటికీ ఆస్ట్రేలియా మీడియా మాత్రం కోహ్లీపై తీవ్ర అక్కసు వెళ్ళగక్కుతోంది. “క్లౌన్” జోకర్ అనే పదంతో తీవ్రమైన విమర్శలు గుప్పిస్తోంది. 

నాకేం ఆశ్చర్యంగా లేదు..

ఆసీస్‌ మీడియా ఇలానే చేస్తుంది. నాకేం ఆశ్చర్యంగా అనిపించలేదు. ఎందుకంటే మెల్‌బోర్న్‌లో వాళ్లు గత 13 ఏళ్లుగా మ్యాచ్‌ గెలవలేదు. బోర్డర్ - గావస్కర్ ట్రోఫీని ఇంకా మీరు గెలవలేదు. ఒకవేళ మీరు మెల్‌బోర్న్‌లో గెలిస్తే ఇవన్నీ లెక్కలోకి వస్తాయి. మన ఆటగాళ్లకు మన దేశం మద్దతుగా నిలవాలి అంటూ రవిశాస్త్రి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో  ఆసీస్ 474 పరుగులు చేయగా.. 164/5 తో భారత్ తడబడుతోంది.  

Advertisment
తాజా కథనాలు