/rtv/media/media_files/2024/11/29/NOgYRbYZvfXmz8naT53p.jpg)
ఒక్క క్షణం చాలు మనిషి జీవితాన్ని మర్చేయడానికి. ఒక్క క్షణం చాలు ఎంతటి వాడినైనా కిందకి తొక్కేయడానికి. ఒక్క క్షణం చాలు ధనికుడిని పేదవాడిగా మార్చేయడానికి. తాజాగా అలాంటిదే వెలుగులోకి వచ్చింది.
ఇది కూడా చదవండి: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం!
అతడొక యంగ్ యువకుడు. విదేశాల్లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం సంపాదించాడు. అక్కడ బాగా సంపాదించిన తర్వాత. ఇండియాకు వచ్చాడు. ఇక్కడ కూడా పలు బ్రాండ్ కంపెనీల్లో ఉద్యోగం చేశాడు. నెలకు లక్షల్లో జీతం సంపాదించాడు. అయితే ఒక వ్యసనం అతడి జీవితాన్ని మార్చేసింది.
సూటు బూటు వేసుకుని హ్యాపీగా ఏసీ కింద కూర్చుని పనిచేసుకోవలసిన ఆ యువకుడు తాజాగా బెంగళూరులోని రోడ్లపై బిచ్చమెత్తుకుని కనిపించాడు. తలనిండా జుట్టు, మాసిన గడ్డం, చిరిగిపోయిన బట్టలతో బిచ్చగాడిలా మారిపోయాడు. అతడిని కలిసిన ఓ యువకుడు అతడితో మాట్లాడిన ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: వైసీపీ మాజీ మంత్రి పీఏ అరెస్ట్!
తల్లిదండ్రుల మరణంతో
ఆ వీడియో ప్రకారం.. ఒకప్పుడు ఆ యువకుడు జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో.. ఆ తర్వాత ఇండియాకి వచ్చి బెంగళూరులో ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేశానని చెప్పాడు. అయితే ఇప్పుడు అదే బెంగళూరులో అతడు బిక్షాటన చేయడం అందరిని కంటనీరు తెప్పిస్తుంది. అయితే అతడు ఇలా కావడానికి ముఖ్య కారణం మద్యానికి బానిస కావడమేనని ఆ యువకుడు చెప్పాడు.
ఇది కూడా చదవండి: ఈ నెల 30న అకౌంట్లోకి డబ్బు జమ!
అంతేకాకుండా ఆ వీడియోలో ఆ యువకుడు నాన్‌స్టాప్‌గా ఇంగ్లీష్‌లో మాట్లాడటం చూడవచ్చు. కాగా తన తల్లిదండ్రులు చనిపోయారని.. అప్పటి నుంచే తాను మద్యానికి బానిసై ఇలా తయారైనట్లు పేర్కొన్నాడు. తనను ఎంతో గారాబంగా పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు మరణించడంతోనే ఆ బాధను తట్టుకోలేక మద్యానికి బానిసైనట్లు తెలిపాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో చాలా మంది అయ్యో పాపం అంటూ కామెంట్లు పెడుతున్నారు.