రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం! TG: రైతులకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. త్వరలోనే రైతుల బోరు బావులకు ప్రభుత్వ ఖర్చుతో సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. By V.J Reddy మరియు Nikhil 29 Nov 2024 in తెలంగాణ ఖమ్మం New Update షేర్ చేయండి Bhatti Vikramarka: తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. త్వరలోనే రైతుల బోరు బావులకు ప్రభుత్వ ఖర్చుతో సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం న్యూ ఎనర్జీ పాలసీపై కసరత్తు చేస్తోందని అన్నారు. త్వరలోనే ఈ పాలసీని అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. సోలార్ విద్యుత్ వల్ల కరెంట్ కోతలతో రైతులకు ఇబ్బంది ఉండదని.. అలాగే ప్రభుత్వానికి కూడా కరెంట్ పై భారం తగ్గుతుందని అన్నారు. అలాగే పెద్ద కంపెనీలకు కూడా సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని అన్నారు. ఇది కూడా చదవండి: ఈ నెల 30న అకౌంట్లోకి డబ్బు జమ! ముందు పైలట్ ప్రాజెక్ట్... భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తుందని అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలలో వ్యవసాయ శాఖకు భారీగా నిధులు కేటాయిచినట్లు చెప్పారు. వ్యవసాయ రంగానికి ఈసారి బడ్జెట్ లో రూ.73 వేల కోట్లు కేటాయించామని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన రుణమాఫీ హామీని అమలు చేశామని అన్నారు. కాగా వివిధ కారణాల వల్ల కొంత మంది రైతులకు రుణమాఫీ జరగలేదని.. వారందరికి ఈ నెల 30న రుణమాఫీ జరుగుతుందని చెప్పారు. అలాగే రైతు భరోసాపై ప్రభుత్వం తీపి కబురు అందించనున్నట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: వైసీపీ మాజీ మంత్రి పీఏ ఇంట్లో ఏసీబీ దాడులు! తెలంగాణ ప్రభుత్వం న్యూ ఎనర్జీ పాలసీపై కసరత్తు చేస్తుందని చెప్పారు. ఈ పాలసీ కింద రైతులకు త్వరలోనే వ్యవసాయ క్షేత్రంలో బోరు బావులకు ప్రభుత్వ ఖర్చుతో సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సోలార్ ఏర్పాటు చేయడం వల్ల రైతులకు కరెంట్ ఖర్చు తగ్గడమే కాకూండా.. ఆదాయం కూడా పొందవచ్చని అన్నారు. సోలార్ ప్యానల్స్ ద్వారా మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు సరఫరా చేస్తే రైతులకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని.. అటు పంటతో పాటు ఇటు సోలార్ విద్యుత్ వల్ల రైతులు తమ ఆదాయాన్ని పెంచుకోవచ్చని చెప్పారు. అయితే.. తొలుత పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని గ్రామాల్లో దీన్ని అమలు చేస్తామని అన్నారు. త్వరతరగతిన మిగితా గ్రామాల్లో కూడా బావి బోర్లా వద్ద ఈ సోలార్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. Also Read:Rain Alert : ఏపీకి తప్పిన తుపాను ముప్పు..ఈరోజు, రేపు భారీ వర్షాలు! PM కుసుమ్ యోజన పథకం కింద రైతులకు ఈ ఫ్రీ సోలార్ పంపు సెట్లను అందించనుంది రేవంత్ సర్కార్. వాస్తవానికి సోలార్ పంప్ సెట్ ధర రూ.50 వేలకు పైగానే ఉంది. అయితే ప్రభుత్వం దీన్ని పూర్తి ఫ్రీగా అందించనుంది. ఇన్‌స్టలేషన్ కూడా ఫ్రీగానే చేయనుంది. దీంతో ఆ డబ్బులు రైతులకు ఆదా కానున్నాయి. ఇతర ప్రయోజనాలు.. కరెంటు ఖర్చు ఆదా: వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఉచితంగా విద్యుత్ అందిస్తోంది. ప్రభుత్వానికి పడే భారం తగ్గుతుంది.పర్యావరణ పరిరక్షణ: సౌరశక్తి స్వచ్ఛమైన శక్తి వనరు, ఇది కాలుష్యాన్ని తగ్గిస్తుంది. పర్యావరణాన్ని సంరక్షించడంలో సహాయపడుతుంది.భూగర్భజలాల స్థాయి మెరుగుదల: కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియక రైతులు చాలా మంది అటోమేటిక్ స్టార్టర్లను వాడుతున్నారు. చాలా మంది 24 గంటల పాటూ ఆన్ చేసే ఉంచుతారు. అయితే.. ఈ సోలార్ పంప్ ఉంటే ఆ టెన్షన్ ఉండదు. రైతులు అవసరాన్ని బట్టి నీటిని వాడుకోవచ్చు. ఇది భూగర్భజలాల స్థాయిని మెరుగుపరుస్తుంది.కరెంట్ కోతల టెన్షన్ ఉండదు: సోలార్ పంప్ సెట్స్ వాడడం ద్వారా రైతులకు కరెంట్ కోతల టెన్షన్ ఉండదు. నిరంతరాయ విద్యుత్ పొందొచ్చు. ఆదాయం: రైతులు తమ అవసరాలకు పోగా.. మిగతా విద్యుత్ ను గ్రిడ్ కు అమ్ముకోవచ్చు. మెయింటెనెన్స్ తక్కువ: విద్యుత్ మోటార్లకు మెయింటెనెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. దూరంగా ఉన్న స్తంభాల నుంచి తీగల ద్వారా కనెక్షన్లు ఇస్తూ ఉంటారు. ఇదంతా రిస్క్, ఖర్చుతో కూడుకున్న పని. కొన్ని సార్లు ఆ తీగలు తెగి షాక్ కు గురై రైతులు ప్రాణాలు కూడా కోల్పోతుంటారు. అదే సోలార్ పంపు సెట్లకు ఈ సమస్య ఉండదు. ట్రాన్స్ ఫార్మర్ల రిపేర్ లాంటి సమస్యలు కూడా ఉండవు. మెయింటెనెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. రిపేర్లు కూడా చాలా అరుదుగా వస్తాయి. ఆ ఖర్చు కూడా తగ్గుతుంది. కావాల్సిన పత్రాలు.. ఆధార్ కార్డురేషన్ కార్డుబ్యాంకు ఖాతా పాస్ బుక్మొబైల్ నంబర్రిజిస్ట్రేషన్ కాపీసర్టిఫైడ్ లెటర్భూమి దస్తావేజు కాపీపాస్పోర్ట్ సైజు ఫోటో విద్యుత్ అమ్మడం ఎలా? సోలర్ ప్యానెల్స్ లో విద్యుత్ ను ఉత్పత్తి చేసి దాన్ని పంపు సెట్లకు సరఫరా అయ్యేలా సెట్ చేస్తారు. తద్వారా మోటార్ పని చేస్తుంది. అయితే.. ఉదాహరణకు మీ సోలార్ ప్యానల్ 45 వాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తే మీరు కేవలం 20 మాత్రమే వాడుకున్నారు అనుకోండి.. అలాంటి సమయంలో మీరు మిగిలిన ఆ 25 వాట్ల విద్యుత్ ను గ్రిడ్ కు విక్రయించుకోవచ్చు. తద్వారా ఆదాయం పొందొచ్చు. ఉదాహరణకు వర్షాకాలం, కోతల సమయంలో రైతులకు పంపు సెట్లు వాడాల్సిన అవసరం ఉండదు. అయినా సోలార్ ప్యానల్ మాత్రం విద్యుత్ ను ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది. ఆ సమయంలో కూడా మీరు విద్యుత్ ను విక్రయించి డబ్బులు సంపాధించవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా మీటర్లను ప్రభుత్వమే ఏర్పాటు చేసి.. మీరు ఉత్పత్తి చేసిన పవర్ ను గ్రిడ్ కు అనుసంధానిస్తూ ఉంటుంది. ఈ ధరను విద్యుత్ సంస్థలు నిర్ణయిస్తూ ఉంటాయి. पीएम कुसुम योजना के अंतर्गत किसानों को वित्तीय और तकनीकी सहायता प्रदान की जाती है, जिससे वे सौर पंप और सौर ऊर्जा प्रणालियों का उपयोग अपनी खेती में कर सकें। इसके साथ ही जल संचयन और सिंचाई के माध्यम से अतिरिक्त आय भी अर्जित कर सकते हैं।#agrigoi #PMKUSUM #microirrigation #solarpump pic.twitter.com/NTnA7tKMzB — Agriculture INDIA (@AgriGoI) August 5, 2024 Also Read:Telangana: పంచాయతీ ఎన్నికలపై సర్కార్ కీలక నిర్ణయం! #telangana-farmers #Deputy CM Bhatti Vikramarka #cm-revanth-reddy #solar pumps మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి