/rtv/media/media_files/2025/11/13/fotojet-86-2025-11-13-17-45-30.jpg)
Delhi Red Fort bomb blast.. Umar committed suicide..
Red Fort Bomb Blast: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం జరిగిన కారు పేలుడు(lal quila car blast) ఘటనకు సంబంధించి అనేక కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. పేలిపోయిన కారును నడిపింది ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ ఉన్ నబీ అని DNA పరీక్ష ద్వారా నిర్ధారణ అయింది. ఈ పేలుడులో 12 మంది మరణించగా.. 20మందికిపైగా గాయపడ్డారు. దర్యాప్తు సంస్థలు డాక్టర్ ఉమర్ ఉన్ నబీ తల్లి DNA నమూనాలను, పేలుడు జరిగిన ప్రదేశం నుండి, ముఖ్యంగా కారు నుంచి స్వాధీనం చేసుకున్న ఎముకలు, దంతాల DNA నమూనాలతో సరిపోల్చారు. కాగా DNA నమూనాలు తల్లితో పూర్తిగా సరిపోలాయి. పేలుడు తర్వాత డాక్టర్ ఉమర్ కాలు స్టీరింగ్ వీల్, యాక్సిలరేటర్ మధ్య చిక్కుకుపోయినట్లు దర్యాప్తులో గుర్తించారు. దీంతో ఉమరే కారును నడిపినట్లు స్పష్టం చేస్తున్నాయి.
అరెస్టు చేసిన ఇతర ఉగ్రవాద అనుమానితులను దర్యాప్తు సంస్థలు ప్రశ్నించగా.. డాక్టర్ ఉమర్ ఏదో అద్భుతమైనది చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు చెప్పినట్లు వెల్లడించాయి. అయితే జైష్-ఏ-మొహమ్మద్ మాడ్యూల్ ప్లాన్ చేసిన ఆ పెద్ద ఉగ్రవాద కుట్ర ఏమిటో మాత్రం వారు చెప్పలేదు. దీంతో ఉగ్రవాదులు ఏం చేయాలనుకున్నారు అనే విషయం లో స్పష్టత రాలేదు. ప్రాథమిక దర్యాప్తులో మాత్రం ఉమర్ తో పాటు ఆయన బృందం.. నేషనల్ క్యాపిటల్ రీజియన్‌తో సహా దేశవ్యాప్తంగా వరుస పేలుళ్లకు ప్రణాళికలు రచించినట్లు వెల్లడైంది. అయితే పోలీసులకు కొంత సమచారం అందటంతో ఈ పేలుడుకు ముందే పోలీసులు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో దాడులు చేసి పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసులు అనుమానితులను అరెస్టు చేయడం, భారీగా పేలుడు పదార్థాలను పట్టుకోవడంతో ఉమర్‌లో భయం మొదలైంది. అందుకే అతను తమ ప్రణాళిక కంటే ముందే ఈ దాడి చేశాడని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి.
ఉమర్, అతని సహచరులు ఐఈడీలు, అసాల్ట్ రైఫిళ్లను ఉపయోగించి భారీ దాడులు చేయడానికి మూడు వాహనాలను కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఫరీదాబాద్‌లోని ఒక గ్రామంలో స్వాధీనం చేసుకున్న ఎర్ర ఎకోస్పోర్ట్‌ను మరో ఉగ్రవాద అనుమానితుడు డాక్టర్ ముజమ్మిల్ ఉపయోగించినట్లు దర్యాప్తులో గుర్తించారు. పేలుడుకు సంబంధించిన కారు అమ్మకం, కొనుగోలుతో సంబంధం ఉన్న ముగ్గురు వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
కాగా ఉమర్ నబీ ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్న డన్న విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు నమ్మలేకపోతున్నారు. ఉమర్ నబీ వదిన ముజామిల్ మాట్లాడుతూ.. ఉమర్ చిన్నప్పటి నుంచీ సైలెంట్‌గా ఉండేవాడని.. స్నేహితులు తక్కువని, చదువుపై మాత్రమే దృష్టి పెట్టేవారని తెలపడం గమనార్హం.‘‘అతను ఫరీదాబాద్‌లోని ఒక కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. పరీక్షలతో బిజీగా ఉన్నానని, మూడు రోజుల తర్వాత ఇంటికి తిరిగి వస్తానని శుక్రవారం ఫోన్ చేశాడని. అతని లాంటి వ్యక్తి ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనడం షాక్‌కు గురిచేసింది’’ అని ముజామిల్ ఆవేదన వ్యక్తం చేసింది.
కాగా ఢిల్లీ పేలుడులో అమ్మోనియం నైట్రేట్, ఇంధన నూనె, డిటోనేటర్లను ఉపయోగించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీనికి ఫరీదాబాద్‌లో బయటపడిన 2,900 కిలోల పేలుడు పదార్థాలతో సంబంధం ఉందని కూడా నిర్ధారించారు. ప్రస్తుతం చట్టవిరుద్ధ కార్యకలాపాల చట్టం, పేలుడు పదార్థాల చట్టం కింద పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయగా. ఈ కేసు దర్యాప్తును హోంశాఖ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించింది.
Also Read : అల్‌ఫలా యూనివర్సిటీ.. రూమ్ నెంబర్ 13లో ఉగ్రకుట్రకు ప్లాన్
మూడో కారు దొరికింది
ఉగ్రవాదులు మొత్తం నాలుగు కార్లతో పేలుళ్లకు కుట్ర చేసినట్లు పోలీసులు తెలిపారు. ఉమర్ ఐ20 కారులో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. తాజాగా, మూడో కారును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఐ20, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కార్లు ఉమర్ పేరు మీద రిజిస్టర్ అయినట్లు గుర్తించారు. మారుతి స్విఫ్ట్ డిజైర్ కారు ముజంమిల్ పేరు మీద రిజిస్టర్ అయింది. మారుతీ బ్రీజా కారు డాక్టర్ షహీనా పేరు మీద రిజిస్టర్ అయింది. దర్యాప్తు సంస్థలకు అల్ఫల కాలేజీలో కీలక ఆధారాలు దొరికాయి. ఉగ్రవాదులు కాలేజీలోని ల్యాబ్ నుంచి పలు కెమికల్స్ సేకరించినట్లు తెలుస్తోంది. అధికారులు ఒక్కొక్కరిగా కేసుతో సంబంధం ఉన్నవారిని అరెస్ట్ చేస్తున్నారు. . వీరిలో ఫరీదాబాద్‌కు చెందిన కారు డీలర్ కూడా ఉన్నాడు. బాంబ్ బ్లాస్ట్ జరిగిన ఐ20 వైట్ కారును అమ్మింది అతడే. బాంబు దాడి జరగడానికి 13 రోజుల ముందే అతడు నిందితుడికి కారు అమ్మాడు.
హరియాణాలోని ఖండవాలీ గ్రామంలో రెడ్ పోర్డ్ ఈకోస్పోర్ట్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది ఢిల్లీ కారు బాంబు పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న డాక్టర్ ఉమర్‌దిగా గుర్తించారు. ఆ కారు సదరు గ్రామంలో ఓ ఇంటి బయట పార్క్ చేసి ఉండటంతో దాన్ని తనిఖీ చేసి చూడగా అది ఉమర్ మహ్మద్‌కు చెందినిదిగా తేలింది. దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ కారులోనే ఢిల్లీ పేలుళ్లకు సంబంధించి భారీ పేలుడు పదార్థాలను తీసుకొచ్చినట్లు అనుమానిస్తున్నారు.
Also Read : SLBC టన్నెల్ నిర్మాణ సంస్థ ఎండీ మనోజ్ గౌర్ అరెస్టు.. కారణం అదేనా?
Follow Us