/rtv/media/media_files/2025/11/23/illegal-bangladehis-2025-11-23-20-20-02.jpg)
SIR sparks reverse migration of 'illegal Bangladehis' from west bengal
పశ్చిమ బెంగాల్‌లో ఓటరు జాబితా సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ జరుగుతోంది. దీంతో చట్టవిరుద్ధంగా నివసిస్తున్న వలసదారుల్లో భయం నెలకొంది. ఎన్నోఏళ్ల నుంచి భారత్‌లో అక్రమంగా నివసిస్తున్న వందలాది మంది బంగ్లాదేశీయులు తమ స్వంత దేశానికి పారిపోతున్నారు. తమ బిడ్డలను ఎత్తుకొని, బ్యాగుల్లో సామాన్లు పెట్టుకుని వెళ్లిపోతున్నట్లు బెంగాల్‌లోని స్థానికులు చెబుతున్నారు. ఉత్తర 24 పరగణాస్ జిల్లాలో హకీంపూర్ BSF ఔట్‌పోస్టు వద్ద ప్రస్తుతం రద్దీ నెలకొంది. అలాగే దక్షిణ బెంగాల్‌లో కూడా అన్ని సరిహద్దుల్లో ఈ నెల ప్రారంభం నుంచి ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి.
బంగ్లాదేశ్ నుంచి వచ్చి అక్రమంగా ఉంటున్న షాహిన్‌బీబీ అనే మహిళ దీనిగురించి మాట్లాడారు. తమ దేశంలో పనులు లేక మధ్యవర్తులకు రూ.5 వేల నుంచి రూ.20 వేలు ఇచ్చి భారత్‌లోకి వచ్చామని తెలిపారు. తాను కోల్‌కతాలోని ఓ ఇంట్లో పనిమనిషిగా చేరానని.. నెలకు రూ.20 వేలు సంపాదిస్తూ ప్రతీనెల ఇంటికి డబ్బులు పంపేదాన్నని చెప్పారు. అంతేకాదు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్లలో చాలామందికి ఆధార్, ఓటర్, రేషన్ కార్డులు కూడా ఉన్నాయి. మధ్యవర్తులకు డబ్బులు ఇచ్చి వాటిని తీసుకున్నామని.. గత ఎన్నికల్లో కూడా ఓట్లు వేశామని తెలిపారు.
Also Read: దారుణం.. స్కూల్ గ్రౌండ్‌లో బాలికపై అత్యాచారం
ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో SIR మొదలుకావడంతో తాము దొరికిపోతే అరెస్టు చేస్తారనే భయంతో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చాలామంది అక్రమ వలసదారులు భావిస్తున్నారు.వీళ్లలో చాలామంది కోల్‌కతా, బిరాటీ, ధులాగోరీ లాంటి అనే ప్రాంతాల్లో దుకాణాలు, ఇళ్లు, హోటళ్లలో పనిచేయడం, రిక్షా నడుపుకోవడం లాంటి పనులు చేసుకుంటున్నారు. పదేళ్లకు పైగా ఇక్కడ ఉంటున్నవాళ్లు కూడా ఉన్నారు.
అయితే ప్రతిరోజూ ఔట్‌పోస్టు నుంచి 150 నుంచి 200 మంది బంగ్లాదేశ్‌కు వెళ్లిపోతున్నారని BSF అధికారులు చెప్పారు. వాళ్ల బయోమెట్రిక్ వివరాలు తీసుకున్న తర్వాత పోలీసులు పంపిస్తున్నారని తెలిపారు. ముందుగా వీళ్లని పోలీసులు అరెస్టు చేసినప్పటికీ స్టేషన్‌లలో ఉండేందుకు స్థలం లేక కస్టడీల్లోకి తీసుకోవడం లేదు. దీంతో వలసదారులు సరిహద్దు వెంబడి తమ స్వదేశానికి వెళ్లిపోతున్నారు. వీళ్లు వెళ్లేందుకు BSF సిబ్బంది ఆహార ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.
Also Read: తల్లి పాలలో యురేనియం.. ప్రమాదం లేదంటున్న శాస్త్రవేత్తలు
ఇక SIR ప్రక్రియతో పశ్చిమ బెంగాల్‌లో రాజకీయాలు వేడెక్కాయి. ఓటు బ్యాంకు కోసం తృణమూల్ కాంగ్రెస్(TMC) పార్టీ భారీగా చొరబాట్లను ప్రోత్సహించిందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. అక్రమ వలసదారులను తమ స్వదేశానికి పంపాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఓటరు జాబితా నుంచి ఫేక్ ఓటర్లను తొలగించడమే SIR లక్ష్యమని చెబుతున్నారు. ఇక బీజేపీపై కూడా టీఎంసీ విమర్శలు చేస్తోంది. విదేశీయులు సరిహద్దు నుంచి ఎలా వస్తున్నారంటూ ప్రశ్నిస్తోంది. అంతర్జాతీయ సరిహద్దుల్లో బలమైన నిఘా ఉంచాల్సిన బాధ్యత కేంద్రం పైనే ఉంటుందంటూ సెటైర్లు వేస్తున్నారు.
Also Read: ప్రాదేశిక విస్తరణ కోసం బెదిరింపులు, బలప్రయోగం చేయకూడదు..జీ20 ప్రకటన
Follow Us