/rtv/media/media_files/2025/11/23/gujarat-2025-11-23-18-32-13.jpg)
Girl, 7, Sexually Assaulted On School Grounds in gujarat
గుజరాత్(gujarat) లోని అహ్మదాబాద్‌లో దారుణం జరిగింది. స్కూల్ గ్రౌండ్‌లో బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం(sexually-assaulted) చేయడం కలకలం రేపుతోంది. ఆ తర్వాత నిందితుడు ఆమెకు ఒక ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు. ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే మెహాసానా జిల్లాలోని విజాపూర్‌కు చెందిన ఓ బాలిక(7) రెండో తరగతి చదువుతోంది. నవంబర్ 19న పాఠశాల వెనుకున్న గార్డెన్‌లోకి ఓ వ్యక్తి ఆ బాలికను తీసుకెళ్లాడు.
అక్కడ ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ అనుచితంగా తాకాడు. ఆ మరుసటి రోజునే అదే వ్యక్తి స్కూల్ గ్రౌండ్‌లో ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమె కుడి చేతికి ఒక ఇంజెక్షన్ కూడా ఇచ్చారు. జరిగిన విషయం ఎవరికీ చెప్పొద్దంటూ కూడా బెదిరించాడు. బాధిత బాలికకు కడుపు నొప్పి రావడంతో చివరికి జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది.
Also Read: బిహార్ ఎన్నికల్లో రిగ్గింగ్.. ప్రశాంత్ కిషోర్ సంచలన ఆరోపణలు
Girl Sexually Assaulted On School Grounds
ఆ తర్వాత వాళ్లు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై బాలిక తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డ వ్యక్తిపై పోలీసులు పోక్సో చట్టంతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు ఆ ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా పరిశీలిస్తున్నారు. బాలికకు ఇంజెక్షన్ ఎందుకు ఇచ్చాడనే దానిపై కూడా క్లారిటీ లేదు. ఎలాంటి ఇంజెక్షన్ ఇచ్చాడో కూడా ఇప్పటివరకు తెలియదు.
మెడికల్ రిపోర్టు వచ్చాక ఈ విషయం తెలుస్తుందని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఘటన స్థానికంగా దుమారం రేపుతోంది. స్కూల్ గ్రౌండ్‌లోనే బాలికపై అత్యాచారం చేయడంపై అక్కడివారు తీవ్రంగా మండిపడుతున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
Also Read: ప్రాదేశిక విస్తరణ కోసం బెదిరింపులు, బలప్రయోగం చేయకూడదు..జీ20 ప్రకటన
Follow Us