Putin Modi Meeting: మోదీతో కారులో మాట్లాడి.. సీక్రెట్ లీక్ చేసిన పుతిన్

చైనాలో SCO సదస్సు సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒకే లిమోజిన్‌లో చేసిన ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మోదీతో ఏం మాట్లాడారు అనే రహస్యాన్ని పుతిన్ రష్యా మీడియాకు వెల్లడించారు.

New Update
Putin with Modi in the car

Putin Modi Meeting: షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సు సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒకే లిమోజిన్‌లో చేసిన ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇది ఇరు దేశాల మధ్య ఉన్న ప్రత్యేకమైన బంధాన్ని మరోసారి చాటి చెప్పింది. ఈ నేపథ్యంలో ఆ ప్రయాణంలో మోదీతో ఏం మాట్లాడారు అనే రహస్యాన్ని పుతిన్ రష్యా మీడియాకు వెల్లడించారు.

Also Read: ధ్వంసమైన పాక్ ఎయిర్ బేస్‌లో ఇప్పుడు ఏం జరుగుతోందో తెలుసా?

"ఇది రహస్యం కాదు. నేను మోదీకి అలాస్కాలో జరిగిన చర్చల గురించి చెప్పాను" అని పుతిన్ తెలిపారు. ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో అలాస్కాలో జరిగిన సమావేశం వివరాలను పుతిన్ మోదీకి వివరించినట్లు స్పష్టమైంది. ఈ చర్చలు ఉక్రెయిన్ సంక్షోభం చుట్టూ జరిగాయని ఆయన సూచించారు.

చైనాలోని తియాంజిన్‌లో జరిగిన SCO సదస్సు తర్వాత మోదీ, పుతిన్ తమ ద్వైపాక్షిక భేటీ కోసం ఒకే కారులో ప్రయాణించారు. ఈ ప్రయాణం కేవలం 15 నిమిషాల పాటు ఉండగా, వారు దాదాపు గంటసేపు కారు దిగకుండా మాట్లాడుకున్నారు. ఈ సుదీర్ఘ సంభాషణ పలు ఊహాగానాలకు దారితీసింది. రష్యా అధ్యక్షుడి కారు లిమోజిన్‌లో రహస్యాలను గోప్యంగా ఉంచే టెక్నాలజీ ఉంది. కాబట్టి, వారు అత్యంత సున్నితమైన అంశాలను చర్చించుకున్నారని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాపై అమెరికా, పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి. అయినప్పటికీ, రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లను భారత్ కొనసాగించింది. ఈ నేపథ్యంలో అమెరికా భారత్‌పై సుంకాలు విధించి ఒత్తిడి పెంచింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ భారత్-రష్యా సంబంధాలు మరింత బలోపేతం కావడం, మోదీ, పుతిన్ మధ్య వ్యక్తిగత బంధం ఎంత బలమైందో ఈ ఘటన నిరూపించింది.

మోదీ, పుతిన్ మధ్య జరిగిన ఈ ప్రైవేట్ సంభాషణ, ప్రపంచ రాజకీయాల్లో భారత్ కీలక పాత్ర పోషిస్తోందనడానికి నిదర్శనం. అమెరికా, రష్యాతో ఒకే సమయంలో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ, తన వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని భారత్ చాటుకుంటోంది. పుతిన్ తన లిమోజిన్‌ కారులో మోదీతో ప్రయాణించడం ఇండియాకు రష్యా ఇస్తున్న ప్రాధాన్యతను కూడా ఇది సూచిస్తుంది. తదుపరి డిసెంబర్‌లో పుతిన్ భారత్‌ను సందర్శించనున్నారు. ఈ పర్యటనలో మరింత లోతైన చర్చలు జరిగే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు