Trump Tariffs: ట్రంప్ సుంకాల దెబ్బకు పడిపోయిన చమురు ధరలు..కంగారులో రష్యా

ట్రంప్ టారీఫ్ లదెబ్బకు చమురు దెబ్బలు దారుణంగా పడిపోయాయి. బ్యారెల్ చమురు ధర 52 డాలర్లకు తగ్గిపోయింది. దీంతో ఎక్కువగా చమురు, ఖనిజ ఉత్పత్తులపై ఆధారపడే రష్యా కంగారు పడుతోంది. 

New Update
usa

Russia worried about Oil rates

ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలు ప్రపంచ దేశాల కళ్ళెంబట నీళ్ళు తెప్పిస్తున్నాయి. మొత్తం వరల్డ్ మార్కెట్ అంతా కుదేలయిపోయింది. దీంతో చమురు ధరలు కూడా బాగా పడిపోయాయి.  నిన్న బ్యారెల్ చమురు ధర 60 డాలర్ల కంటే తక్కువకు పడిపోయింది. ఈ ప్రభావం రష్యా ఉరల్ ఆయిల్ మీద కూడా పడింది. దీని ధర బ్యారెల్ ధర దాదాపు 50 డాలర్లకు చేరుకుంది. 

ఆందోళనలో రష్యా..

చమురు ధరలు తగ్గడంతో రష్యా ఆందోళనలో పడింది. ఈ దేశం ఎక్కువగా చమురు, ఖనిజ ఉత్పత్తులపై ఆధారపడి ఉంది. వీటి నుంచి వచ్చే డబ్బులతోనే ప్రభుత్వ బడ్జెట్ అంతా నడుస్తుంది. గతేడాది ఇదే నెలలో చమురు ఆదాయం కంటే ఈ ఏడాది 17శాతానికి పైగా తగ్గిందని రష్యా చెబుతోంది. ఇదంతా ట్రంప్ ప్రతీకార సుంకాల వల్లనే అంటోంది రష్యా. దీనిపై ఆ దేశ ప్రభుత్వ ప్రతినిధి పెస్కోవ్ మాట్లాడుతూ ప్రస్తుతం పరిస్థితి చాలా అల్లకల్లోలంగా , ఉద్రిక్తంగా ఉందని అన్నారు. తాము పరిస్థితులను చాలా నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడానికి చర్యలను తీసుకోవాలనుకుంటున్నామని తెలిపారు. శుక్రవారం నాడు బాల్టిక్ సముద్రంలోని ప్రిమోర్స్క్ ఓడరేవులో రష్యాకు చెందిన ఉరల్ చమురు బ్యారెల్‌కు $52 కనిష్టంగా  నమోదయింది. ఇది సోయవారానికి మరింత పడిపోయి బ్యారెల్ ధర 50 డాలర్ల మార్కుకు చేరుకుంది. మరోవైపు 72 గంటల్లోపు ప్రపంచ మార్కెట్లు ట్రిలియన్ డాలర్లు నష్టపోయాయి. అలాగే అమెరికా బెంచ్‌మార్క్ అయిన WTI క్రూడ్ లేదా టెక్సాస్ క్రూడ్ కూడా బ్యారెల్‌కు $60 కనిష్ట స్థాయిలో ఉంది. అంతర్జాతీయంగా కూడా బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్‌కు $64కి పడిపోయాయి. 

కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం వీటిని వేటినీ ఒప్పుకోవడం లేదు. చమురు ధరలు తగ్గాయి, వడ్డీ రేట్లు తగ్గాయి, ఆహార ధరలు తగ్గాయి, ద్రవ్యోల్బణం లేదు. అలాగే ప్రతీకార సుంకాల ద్వారా వారానికి బిలియన్ల డాలర్ల సంపద వస్తోందని అమెరికా అధ్యక్షుడు తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

today-latest-news-in-telugu | donald trump tariffs | russia | crude-oil-rates

Also Read: USA: 90 రోజులు టారీఫ్ లకు బ్రేక్..అంతా ఒట్టిదే..వైట్ హౌస్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు