Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

మహారాష్ట్రలో ఓ టక్కు బీభత్స సృష్టించింది. ఎదురుగా ఉన్న వాహనాలు ఢీకొనడంతో మంటలు చెలరేగి ఏడుగురు మృతి చెందారు. మరో 20 మంది గాయాలపాలయ్యారు.

New Update
Seven killed, several injured in major accident in Pune’s Navale Bridge area in Maharashtra

Seven killed, several injured in major accident in Pune’s Navale Bridge area in Maharashtra

ఈ మధ్య రోడ్డు ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా మహారాష్ట్ర(maharashtra) లో ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. ఎదురుగా ఉన్న వాహనాలు ఢీకొనడంతో మంటలు చెలరేగి ఏడుగురు మృతి చెందారు. మరో 20 మంది గాయాలపాలయ్యారు. గురువారం సాయంత్రం పుణె-బెంగళూరు హైవే నవలే బ్రిడ్జి సమీపంలో సెల్ఫీ పాయింట్‌ ఈ ఘటన చోటుచేసుకుంది. ట్రక్‌ అదుపు తప్పడంతో ఎదురుగా ఉన్న వాహనాలను ఢీకొట్టింది. 

Also Read: అయ్యో పాపం.. లిఫ్ట్‌ గుంతలో పడి వృద్ధుడు మృతి

Road Accident In Pune

దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆరుకు పైగా వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. 20 మంది గాయపడ్డారు. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

Also Read :  భార్యాభర్తల మధ్య లొల్లి పెట్టిన కుక్క.. కోర్టు మెట్లెక్కిన భర్త!

Advertisment
తాజా కథనాలు