Crime: అయ్యో పాపం.. లిఫ్ట్‌ గుంతలో పడి వృద్ధుడు మృతి

హైదరాబాద్‌లోని చాంద్రయాణగుట్టలో విషాదం జరిగింది. లిఫ్ట్‌ గుంతలో పడి ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇక వివరాల్లోకి వెళ్తే. అబ్దుల్ బిన్ సయోద్ (69) అనే వ్యక్తి కూతురు చాంద్రయణగుట్టలో ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటోంది.

New Update
death

Death

హైదరాబాద్‌(hyderabad) లోని చాంద్రయాణగుట్టలో విషాదం జరిగింది. లిఫ్ట్‌ గుంతలో పడి ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇక వివరాల్లోకి వెళ్తే. అబ్దుల్ బిన్ సయోద్ (69) అనే వ్యక్తి కూతురు చాంద్రయణగుట్టలో ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటోంది. అయితే ఆమెను చూసేందుకు అబ్దుల్‌ ఐదో ఫ్లోర్‌కు వెళ్లాడు. ఆ తర్వాత తిరిగి వెళ్లేందుకు లిఫ్ట్ దగ్గరికి వచ్చాడు. కానీ లిఫ్ట్‌ రాకముందే అక్కడున్న తలుపులు తెరుచుకున్నాయి. దీంతో అతడు ఆ లిఫ్ట్‌ గుంతలో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. 

Also Read: విషాదం.. బహ్రెయిన్‌లో తెలంగాణ యువకుడు ఆత్మహత్య

Elderly Man Dies After Falling Into Elevator Pit

సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఆ అపార్ట్‌మెంట్‌ నిర్వహణకు సంబంధించి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దానికి జీహెచ్‌ఎంసీ అనుమతి కూడా లేదని అక్కడి స్థానికులు చెబుతున్నారు. పర్మిషన్‌ లేకుండానే ఐదు అంతస్తులు నిర్మించారని తెలుస్తోంది. 

Also read: ఢిల్లీ పేలుడులో షాకింగ్ ఘటన.. 300 మీటర్ల దూరంలో తెగిపడిన చేయి.. భయపడుతున్న స్థానికులు

Advertisment
తాజా కథనాలు