/rtv/media/media_files/2025/11/04/suv-2025-11-04-06-50-50.jpg)
తిరుపతి(tirupati) లోని ప్రముఖ శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం(SV University) మరోసారి ర్యాగింగ్(ragging) ఘటన సంచలనంగా మారింది. విశ్వవిద్యాలయంలోని సైకాలజీ విభాగంలో సీనియర్ విద్యార్థులు జూనియర్లను ర్యాగింగ్‌కు గురిచేసినట్లుగా ఫిర్యాదులు రావడంతో ఈ ఘటన సంచలనం సృష్టించింది. సైకాలజీ విభాగంలో చదువుతున్న జూనియర్ విద్యార్థులను కొంతమంది సీనియర్ విద్యార్థులు వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి.
Also Read : కలవరపెట్టిన బస్సు ప్రమాదాలు..తెల్లవారుజామునే...
ర్యాగింగ్‌పై ఫిర్యాదు చేయడానికి వెళ్తే!
ర్యాగింగ్‌కు గురైన విద్యార్థులు తమ బాధను HOD దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. ర్యాగింగ్‌పై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన విద్యార్థులు HOD అనుచితంగా మాట్లాడారని విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఆరోపించాయి. ర్యాగింగ్ చేస్తారు, ఏమైనా చేస్తారు" HOD బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు విద్యార్థుల భద్రత పట్ల యూనివర్సిటీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని స్పష్టం చేస్తున్నాయని వారు మండిపడ్డారు. విభాగాధిపతి చేసిన వ్యాఖ్యలపై, ర్యాగింగ్ ఘటనపై విద్యార్థి సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి.
విద్యార్థుల భద్రతను పట్టించుకోని, అనుచిత వ్యాఖ్యలు చేసిన విభాగాధిపతిని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశాయి. ర్యాగింగ్‌కు పాల్పడిన సీనియర్ విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.క్యాంపస్‌లో జూనియర్ విద్యార్థులకు పూర్తి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనతో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యూనివర్సిటీ యాజమాన్యం ఈ ర్యాగింగ్ ఘటనపై, అలాగే విభాగాధిపతి వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
Also Read : తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాలకు పిడుగు ప్రమాదం తప్పదు!
Follow Us