/rtv/media/media_files/2025/04/02/sQVm38TNYm3OK9lv3QZi.jpg)
Waqf Bill
వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారం రేపుతుంది. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్, డైమండ్ హార్బర్, ఢిల్లీ, తమిళనాడు వంటి ప్రాంతాల్లో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్, టిఎంసి, డిఎంకె, సీపీఐ(ఎం), ఆర్జేడీ, జెఎంఎం, ఆప్ వంటి పార్టీల ఇండియా బ్లాక్ కూటమి రాజకీయంగా వక్ఫ్ బోర్డు బిల్లుపై విషం చిమ్ముతున్నాయి. కేంద్ర ప్రభుత్వం మతపరమైన వక్ఫ్ బోర్డు ఆస్తుల్లో అవినీతి, దుర్వినియోగాన్ని అరికట్టడానికి వక్ఫ్ బోర్డు సవరణ చట్టం 2025 తీసుకువస్తున్నామని స్పష్టం చేసింది. ఈ మార్పు పారదర్శకత, న్యాయంగా, ప్రజా సంక్షేమం కోసం ఉద్దేశించినది.
చాలారోజులుగా వక్ఫ్ బోర్డుల భూములు అన్యాక్రాతం అయ్యాయి. సరైన ప్రక్రియ లేకుండా ఏ భూమినైనా వక్ఫ్ ఆస్తిగా ప్రకటించాయి. కేంద్రం వక్ఫ్ బోర్డులకు ఏకపక్ష అధికారాలను ఇచ్చే నిబంధన సెక్షన్ 40ని రద్దు చేయడంతో మతపరమైన ఆస్తుల దుర్వినియోగం తగ్గుతుంది. ఈ నిబంధన తరచుగా స్వార్థ ప్రయోజనాల ద్వారా దుర్వినియోగం చేయబడుతుంది.
వక్ఫ్ సవరణ బిల్లు 2025 దేశ పౌరులకు ఈ లాభాలు చేకూరుతాయి.
జవాబుదారీతనం ద్వారా పాలనను మెరుగుపరచడం
ఈ బిల్లు వక్ఫ్ ఆస్తుల ఆర్థిక పరిశీలన, డిజిటలైజేషన్‌ను అమలు చేస్తుంది. దీని వలన ముస్లిం సమాజంలోని పేద, వెనుకబడిన వర్గాలు ప్రయోజనం పొందుతాయి. రాజవంశ మతాధికారులు, రాజకీయ అనుచరుల చేతుల్లో అధికారం కేంద్రీకృతమయ్యే బదులు, ఈ సంస్కరణ ప్రజలకు, ముఖ్యంగా చారిత్రకంగా వెనుకబడిన వారికి అధికారం ఇస్తుంది.
రాష్ట్ర వక్ఫ్ బోర్డులు, కేంద్ర వక్ఫ్ కౌన్సిల్‌లో ముస్లిమేతర సభ్యులను చేర్చారు. ఇది ముస్లిం కమ్యూనిటీ అధికారాన్ని దెబ్బతీస్తుందని విమర్శకులు ఆరోపించారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇది సమ్మిళితత్వాన్ని పెంపొందిస్తుందని వాదిస్తోంది. వక్ఫ్ బోర్డులో మహిళలను చేర్చడంతో వారి స్త్రీప్రాతినిధ్యం, లింగ సమానత్యం పెరుగుతుంది.
భూమికి రక్షణ : ఈ సవరణ బిల్లు ఇండియాలో భూములకు రక్షణ కల్పిస్తోంది. కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ భూమిని వక్ఫ్ ఆస్తి అనే ముసుగులో దుర్వినియోగం చేసిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి భూములను తిరిగి పొందే అధికారాన్ని ఈ బిల్లు ప్రభుత్వానికి ఇచ్చింది
ముస్లిం వ్యతిరేక చట్టం కాదు: ఇది ముల్లీ వ్యతిరేఖ చట్టం కాదని ప్రభుత్వం చెబుతుంది. న్యాయం కోసం, పారదర్శకత కోసం చేసిన సంస్కరణ. వక్ఫ్ సవరణ బిల్లు నిస్సందేహంగా ఆధునీకరణ చొరవ. ఇది వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన రికార్డుల డిజిటలైజేషన్ చేస్తోంది. ఆస్తులను ట్రాక్ చేయడానికి కేంద్రీకృత డేటాబేస్‌ను సృష్టిస్తుంది. టెక్నాలజీతో వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన ఆడిట్‌లను సులభతరం చేస్తుంది.