Delhi: ఢిల్లీలో అంబరాన్నింటిన సంక్రాంతి వేడుకలు

ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంట్లో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నింటాయి. ప్రధాని మోదీ, చిరంజీవి మరికొంత మంది మంత్రులు ఇందులో పాల్గొన్నారు. కిషన్‌రెడ్డి పల్లెటూరులా తన ఇంటిని అలంకరించి..సంక్రాంతి సంబరాలను జరిపించారు.

New Update
delhi

Sankranthi At Minister Kishan Reddy House

తెలుగు వారి పండుగను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీ పట్టుకువెళ్ళారు. అక్కడ తన ఇంట్లో సంక్రాంతి సంబరాలను జరిపించారు. దీనికి ప్రధాని మోదీ హాజరయ్యారు. డప్పు, డోలు వాయిద్యాలతో మోదీని ఘనంగా ఆహ్వానించారు. మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ నాగేశ్వరరావు, బ్యాడ్మింటన్ క్రీడాకారిని పీవీ సింధుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. దీని తరువాత ప్రధాని తులసి చెట్టుకు ప్రత్యేక పూజ నిర్వహించారు. దీని తరువాత గంగిరెద్దుల ఆట సాగింది. అనంతరం వాటికి ఫలాలు అందించి వస్త్రాలు సమర్పించారు. భోగి మంటలు వేశారు. గాయని సునీత తన పాటలతో అలరించారు. 

Also Read: చైనా, ఇండియా సరిహద్దులో గన్ వాడకూడదు.. ఎందుకంటే?

 

ఈ వేడుకల సందర్భంగా కిషన్ రెడ్డి ప్రధాని మోదీకి వెంకటేశ్వరస్వామి ప్రతిమను బహుమతిగా ఇచ్చారు. ఈ సంబరాలకు చాలా మంది తెలుగు, ఇతర మంత్రులు హాజరయ్యారు. స్పీకర్ ఓం బిర్లా, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ శకావత్, జ్యోతి రాధిత్య సింధియా, మనోహర్ లాలా కట్టర్, పెమ్మసాని చంద్రశేఖర్, బండి సంజయ్, సతీష్ చంద్ర దూబే, శ్రీనివాస్ వర్మ, భూపతిరాజు శ్రీనివాసరాజు, పీవీ సింధు, మరికొందరు ప్రముఖులు హాజరయ్యారు. వీరితో పాటూ తెలంగాణ నుంచి ఎంపీలు లక్ష్మణ్ ,అనురాగ్ ఠాకూర్, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, లక్ష్మణ్, గోడెం నగేష్, బాలశౌరి, కొండ విశ్వేశ్వర్ రెడ్డి, డికే అరుణ, పలువురు బీజేపీ నేతలు వచ్చారు. 

 

Also Read: దేవుళ్లు, రాక్షసుల మధ్య యుద్ధం జరిగితే.. కుంభమేళ ఎందుకొచ్చిందంటే..?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు