Premanand Maharaj : అనారోగ్యానికి గురైన ప్రేమానంద్‌ మహారాజ్... పెదవులు వాచిపోయి

టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ, అనుష్క దంపతులు ఎంతగానో ఆరాధించే  ప్రేమానంద్‌ జీ మహారాజ్ అనారోగ్యానికి గురయ్యారు. కొంతకాలంగా ఆయన పాలీసిస్టిక్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు.

New Update
pra

టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ, అనుష్క దంపతులు ఎంతగానో ఆరాధించే  ప్రేమానంద్‌ జీ మహారాజ్ అనారోగ్యానికి గురయ్యారు. కొంతకాలంగా ఆయన పాలీసిస్టిక్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి కారణంగా ఆయన రెండు మూత్రపిండాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.ఈ సమస్య దాదాపు 17 నుంచి 20 సంవత్సరాలుగా ఉంది. ఇటీవల విడుదలైన వీడియోలలో మహారాజ్ కళ్ళు భారంగా, ముఖం, పెదవులు వాచిపోయి, మాట తడబడుతున్నట్లు కనిపించింది.  ఈ అసౌకర్యం ఉన్నప్పటికీ, ఆయన తన ఆధ్యాత్మిక ప్రవచనాలను కొనసాగిస్తున్నారు.

పాద యాత్రను నిరవధికంగా వాయిదా

దేవుడిని తలుచుకోకుండా తనకు మనశ్శాంతి దొరకదని, ఇది అలవాటుగా మారిందని ఆయన భక్తులకు తెలియజేశారు. ఆరోగ్యం క్షీణించడం, విశ్రాంతి అవసరం కారణంగా, ప్రతిరోజు తెల్లవారుజామున ఆయన చేసే పాద యాత్రను నిరవధికంగా వాయిదా వేసినట్లు ఆశ్రమం అధికారికంగా ప్రకటించింది. దీంతో ఆయన దర్శనం కోసం రాత్రంతా ఎదురుచూసే వేలాది మంది భక్తులు నిరాశ చెందారు. 

తాజాగా విడుదలైన ఒక వీడియోలో మహారాజ్ ఆరోగ్యం మెరుగుపడుతున్నట్లు కనిపించింది, ఇది భక్తులకు కొంత ఉపశమనం కలిగించింది.తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందకుండా రాధారాణి నామజపంపై దృష్టి పెట్టాలని ఆయన భక్తులకు సందేశం పంపారు. "కష్టం ఉంది, ఆందోళన ఉంది, కానీ గొప్ప దయ ఉంది. ఇప్పుడు అందరూ సంతోషంగా ఉండండి. త్వరలో కలుస్తాను" అని ఆయన చెప్పినట్లు సమాచారం.

Advertisment
తాజా కథనాలు