India: త్వరలో భారత్‌కు రష్యా అధ్యక్షుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని క్రెమ్లిన్ ప్రతినిధులు ధృవీకరించారు. అయితే ఎప్పుడు పర్యటిస్తారన్నది మాత్రం ఇంకా ఖరారు కాలేదు. వచ్చే ఏడాది మొదట్లో ఉండవచ్చని తెలుస్తోంది. By Manogna alamuru 19 Nov 2024 in నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Russia President Putin రష్యాలో రీసెంట్‌గా జరిగిన 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని మోదీ పాల్గొన్నారు. అకడ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అయ్యారు. అప్పుడు ఇరు దేశాధినేతల మధ్యా ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఇందులో భాగంగా మోదీ..పుతిన్‌ను భారత్‌కు ఆహ్వానించారు. అంతకుముందు జులైలో మోదీ రష్యాలో పర్యటించగా.. మూడు నెలల వ్యవధిలోనే రెండుసార్లు పర్యటించినట్లయ్యింది. ఇప్పుడు పుతిన్ వంతు..త్వరలో ఆయన భారత్‌లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని రష్యా అధికారులు తెలిపారు. అయితే ఇంకా తేదీలు ఖరారు కాలేదని...దీనికి సంబంధించి ఇరు దేశాల మధ్యా సంప్రదింపులు జరుగుతున్నాయని చెప్పారు. వచ్చే ఏడాది మొదట్లో పుతిన్...ఇండియాకు రావచ్చని చెప్పారు. Also Read: Russia: ఉక్రెయిన్‌పై న్యూక్లియర్ అటాక్‌కు రెడీ అవుతున్న రష్యా Also Read: HYD: వాళ్లు నమాజ్ చేస్తే...తాము చాలీసా చదువుతాము..రాజాసింగ్ వార్నింగ్ ప్రస్తుతం ప్రపంచ మూడో యద్ధం గురించి చర్చలు నడుస్తున్నాయి. ఉక్రెయిన్‌కు నాటో, అమెరికా దేశాలు తమ ఆయుధాలను ప్రయోగించుకోవచ్చని అనుమతినిచ్చింది. దీంతో రష్యా అణు యుద్ధానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో పుతిన్ ఇండియా రాక ప్రాధాన్యత సంతరించుకుంది. Also Read: Air India: థాయ్‌లాండ్‌లో చిక్కుకుపోయిన భారతీయులు..80 గంటలుగా అక్కడే.. Also Read: ఎంతకు తెగబడ్డారేంట్రా.. ఏకంగా RBI గవర్నర్ డీప్ ఫేక్ వీడియోను ఎలా చేశారో చూడండి! #russia #putin #india మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి