ఎంతకు తెగబడ్డారేంట్రా.. ఏకంగా RBI గవర్నర్ డీప్ ఫేక్ వీడియోను ఎలా చేశారో చూడండి!

ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అతను స్పందిస్తూ.. ఆర్‌బీఐకి ఈ వీడియోలకి ఎలాంటి సంబంధం లేదని, ఎప్పుడూ ఇలాంటి పెట్టుబడి వీడియోలు ఆర్‌బీఐ ప్రచారం చేయదని తెలిపారు. 

New Update
Shakthikanth das

ఈ మధ్య కాలంలో డీప్ ఫేక్ ఫేస్ వీడియోలు అధికమయ్యాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరిని కూడా వదలడం లేదు. ఇప్పటికి పలువురు సెలబ్రిటీలకు ఇబ్బంది పెట్టిన డీప్ ఫేక్ ఫేస్ వీడియో ఇప్పుడు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌ను కూడా ఇబ్బంది పెట్టింది. పెట్టుబడి పెడితే సలహాలు ఇస్తున్నట్లు ఉన్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. దీంతో ఆర్‌బీఐ గవర్నర్ స్పందింస్తూ.. ప్రజలకు సూచనలు తెలిపారు. 

 ఇది కూడా చూడండి: సుకుమార్ సపోర్ట్ ఆ మ్యూజిక్ డైరెక్టర్ కే.. పుష్ప2 BGMపై సంచలన నిర్ణయం!

ఇది కూడా చూడండి:  AP Crime: ముసలోడికి ఇదేం మాయరోగం..11 ఏళ్ల అమ్మాయిని అలా చేస్తాడా..!

ఇలాంటి ప్రచారాలు ఆర్‌బీఐ ఎప్పుడూ చేయదని..

ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ మాట్లాడుతున్న డీప్‌ఫేక్‌ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో శక్తికాంత దాస్ స్పందిస్తూ.. ఆర్‌బీఐ కొత్తగా పెట్టుబడి పథకాలు తీసుకొస్తోందని, ఎందులో ఇన్వెస్ట్ చేస్తే లాభం ఉంటుందనే వీడియోలు సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చూడండి: అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టు బిగ్ షాక్.. వివేకా హత్య కేసులో మరో కీలక పరిణామం!

ఈ వీడియోలకి ఆర్‌బీఐకి ఎలాంటి సంబంధం లేదని, ఆర్‌బీఐ ఎప్పుడూ ఇలాంటి పెట్టుబడి వీడియోలు ప్రచారం చేయదని తెలిపారు. ఇలాంటి ఫేక్ ప్రచారాలను అసలు ప్రజలు నమ్మవద్దని ఆర్‌డీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సూచించారు.

ఇది కూడా చూడండి: గుండెలను పిండేసే దృశ్యం.. ఆరేళ్ళ తర్వాత అనాథాశ్రమంలో తండ్రి..! కూతుర్లు ఏం చేశారో చూడండి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు