Air India: థాయ్‌లాండ్‌లో చిక్కుకుపోయిన భారతీయులు..80 గంటలుగా అక్కడే.. థాయ్‌లాండ్ నుంచి ఢిల్లీకి రావాల్సిన ఇండియన్స్ వంద మందికి పైగా అక్కడే చిక్కుకుపోయారు. ఎయిర్ ఇండియా విమానంలో పదేపదే సాంకేతిక లోపాలు తలెత్తడంతో ఎయిర్ పోర్ట్‌లోనే ఉండిపోయారు. 80 గంటలుగా అక్కడే ఎదురుచూస్తున్నారు. By Manogna alamuru 19 Nov 2024 | నవీకరించబడింది పై 19 Nov 2024 18:38 IST in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి రెండు, మూడు గంటల్లో వచ్చేయాల్సిన ప్రయాణికులు 80 గంటలు అయినా ఎయిర్ పోర్ట్‌లోనే ఉండిపోయారు. ఎప్పటికి చేరుకుంటారో తెలియని పరిస్థితి. థాయ్ లాండ్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండియన్స్ కు చేదు అనుభవం ఎదురైంది. ఎయిర్ ఇండియా విమానంలో చాలాసార్లు సాంకేతిక సమస్యలు తలెత్తడంతో సుమారు 100మంది భారతీయులు థాయ్‌లాండ్‌లోనే ఉండిపోయారు. దీనికి సంబంధించి అందులోని కొందరు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టడంతో విషయం బయటకు వచ్చింది. Also Read: ఎంతకు తెగబడ్డారేంట్రా.. ఏకంగా RBI గవర్నర్ డీప్ ఫేక్ వీడియోను ఎలా చేశారో చూడండి! Also Read: శబరిమలకు పోటెత్తిన స్వాములు..దర్శనానికి 10 గంటల సమయం! Air India Flight ఎయిరిండియాకు చెందిన ఓ విమానం 100 మందికి పైగా ప్రయాణికులతో నవంబరు 16న థాయ్‌లాండ్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. టేకాఫ్ అయిన కాసేపటికే దానిలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానాన్ని వెనక్కు తీసుకువచ్చేశారు. అప్పటి నుంచీ థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌లోనే ప్రయాణికులు తిప్పలు పడుతున్నారు. దీనికి సంబంధించి ఓ ప్రయాణికుడు..ఢిల్లీకి వెళ్లేందుకు ప్రయాణికులంతా సిద్ధమయ్యారు. కానీ, విమానంలో చిన్న సాంకేతిక లోపం తలెత్తినట్లు ఎయిర్‌లైన్స్ మాకు తెలియజేసింది. దీంతో తొలుత ఆరు గంటల పాటు ఎయిర్‌పోర్టులోనే వేచి చూశాం. ఆ తర్వాత సిద్ధంగా ఉన్న విమానంలో మమల్ని ఎక్కించారు. టేకాఫ్ అయిన రెండు గంటల తర్వాత ఫుకెట్‌లో మళ్లీ విమానాన్ని ల్యాండ్ చేశారు. మరోసారి సాంకేతిక లోపం కారణంగానే అత్యవసర ల్యాండింగ్ చేసినట్లు సిబ్బంది తెలిపారు. అలా 80 గంటలుగా ఎయిర్‌పోర్టులోనే చిక్కుకుపోయాం అంటూ పోస్ట్ పెట్టారు. ఎయిర్ పోర్ట్‌లో ముసలివారు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. Also Read: 25 నుంచి పార్లమెంట్.. జమిలీ ఎన్నికలతో పాటు రానున్న కీలక చట్టాలివే! అయితే..దీనిపై ఎయిర్ ఇండియా స్పందించింది. టేకాఫ తర్వాత వరుసగా సాంకేతిక లోపాలు తలెత్తాయని...ఇలాంటి విమానంతో రిస్క్ తీసుకోలేమని అందుకే అత్యవసర ల్యాండింగ్ చేశామని చెప్పింది. ప్రయాణికులకు వసతులు కల్పించామని..అందరికీ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. Also Read: చెత్త వేస్తే చలానా.. ఫొటో తీసి మరీ పట్టుకుంటారు.. GHMC నయా యాప్ రెడీ! #technical-issue #thailand #air india మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి