Russia: ఉక్రెయిన్‌పై న్యూక్లియర్ అటాక్‌కు రెడీ అవుతున్న రష్యా

అమెరికా నిర్ణయంతో కోపంగా ఉన్న రష్యా...ఉక్రెయిన్ మీద​ అణుదాడికి సిద్ధమైంది. దీనికి సంబంధించి రఫ్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తమ దేశ అణు సిద్ధాంతం సవరణలను ఆమోదించారని తెలుస్తోంది.  దీనికి సంబంధించిన ఫైల్ మీద ఆయన ఈరోజు సంతకం చేశారు.

author-image
By Manogna alamuru
New Update
Russia Elections: ఎన్నిసార్లు మీరే అవుతారు మావా.. మరోసారి పుతినే ప్రెసిడెంట్‌!

Nuclear War: 

 ఉక్రెయిన్‌, రష్యా యుద్ధం మొదలై వెయ్యి రోజులు పూర్తయింది. ఈ నేపథ్యంలో రష్యాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అణ్వాయుధాల వినియోగానికి అనుమతించే నిబంధనలను మరింత సరళతరం చేసే కీలక దస్త్రంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతకం చేశారు. అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశం సాయంతో ఏ దేశమైనా తమపై దాడి చేస్తే.. దాన్ని సంయుక్త దాడిగానే పరిగణిస్తామని ఆ నింబధనల్లో ఉంది. ఉక్రెయిన్‌కు ఇప్పటికే అమెరికా యుద్ధంలో సాయం చేస్తోంది.  దాంతో పాటూ ఇప్పుడు తమ దేశం నుంచి పంపించిన పెద్ద క్షిపణులను ప్రయోగించడానికి అమెరికా ఉక్రెయిన్‌కు అనుమతినిచ్చింది. దీని కారణంగానే పుతిన్ అణ్వాయుధ ఫైల్ మీద సంతకం చేశారని తెలుస్తోంది.

Also Read: HYD: వాళ్లు నమాజ్ చేస్తే...తాము చాలీసా చదువుతాము..రాజాసింగ్‌ వార్నింగ్

Also Read: 25 నుంచి పార్లమెంట్.. జమిలీ ఎన్నికలతో పాటు రానున్న కీలక చట్టాలివే!

కొద్ది రోజుల క్రితమే రష్యా మీద దీర్ఘశ్రేణి ఆయుధాలను ప్రయోగించేందుకు నాటో దేశాలతో పాటూ అమెరికా కూడా పర్మిషన్ ఇచ్చింది.  దీంతో ఆ దేశాలు కూడా తమతో యుద్ధం చేస్తున్నట్టే భావిస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ అప్పుడే ప్రకటించారు. నాటూ సైనిక బలం మీద దాడులు చేస్తామని హెచ్చరించారు. దీని కోసం ఎలాంటి వ్యూహాలకైనా సిద్ధమని చెప్పారు. ఇప్పుడు దానికి రిలేటెడ్‌గానే అణ్వాయుధాల ఉపయోగానికి సంబంధించిన ఫైల్ మీద సంతకం చేశారు. 

Also Read: Air India: థాయ్‌లాండ్‌లో చిక్కుకుపోయిన భారతీయులు..80 గంటలుగా అక్కడే..

Also Read: ఎంతకు తెగబడ్డారేంట్రా.. ఏకంగా RBI గవర్నర్ డీప్ ఫేక్ వీడియోను ఎలా చేశారో చూడండి!

Advertisment
Advertisment
తాజా కథనాలు