Mother in law jump : సీన్‌ రిపీట్‌..కాబోయే అల్లుడితో మరో అత్త జంప్‌

పెళ్లీడుకొచ్చిన అమ్మాయి లేచిపోయిందంటే దానికో అర్థం ఉంటుంది. కానీ బిడ్డకు పెళ్లిచేయాల్సిన తల్లి కాబోయే అల్లుడితో లేచిపోతే ఎలా ఉంటుంది. వినడానికే అసహ్యంగా ఉంటుంది. కానీ ఇప్పుడివే ట్రెండ్‌ అవుతున్నాయి. మరో అత్త అల్లునితో జంప్‌ అయింది.

New Update
Mother in law jump

Mother in law jump

Mother in law jump : ప్రేమించుకున్న యువతి, యువకుడు జంప్‌ అయితే పోనీలే అనుకోవచ్చు...పెళ్లీడుకొచ్చిన అమ్మాయి లేచిపోయిందంటే దానికో అర్థం ఉంటుంది. కానీ బిడ్డకు పెళ్లిచేయాల్సిన తల్లి కాబోయే అల్లుడితో లేచిపోతే ఎలా ఉంటుంది. వినడానికే అసహ్యంగా ఉంటుంది. కానీ ఇప్పుడివే ట్రెండ్‌ అవుతున్నాయి. వయసుతో పనిలేదు. వావివరుసలు అక్కర్లేదు. ఆడ, మగ అయితే చాలు జంప్‌ అంటున్నారు.  ఇటీవల ఓ అత్త కాబోయే అల్లుడితో పారిపోయిన విషయం తెలిసిందే.. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో మరికొన్నిరోజుల్లో కూతురు పెళ్లి అనగా.. బయటకు వెళ్లి అత్తా, అల్లుడూ ఇద్దరూ పరారైన విషయంతెలిసిందే.. ఈ ఘటన మరువక ముందే.. అచ్చం అలాంటి ఘటనే అదే రాష్ట్రంలో  రిపీట్‌ అయింది. మరో అత్త అల్లునితో జంప్‌ అయింది.

ఇది కూడా చూడండి:Pak-India:భారత్‌తో ఉద్రిక్తతల వేళ పాక్‌కు బిగ్ షాక్.. సైనిక అధికారులు, జవాన్ల భారీ రాజీనామాలు!

ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌ బస్తీలోని దుబౌలియా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో వెలుగు చూసింది. దుబౌలియా ప్రాంతానికి చెందిన ఒక అబ్బాయికి గోండా జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన ఒక అమ్మాయితో నాలుగు నెలల క్రితం వివాహం నిశ్చయమైంది. దీని తరువాత, ఇద్దరి మధ్య సంభాషణ ప్రారంభమైంది.. కానీ ఈ సమయంలో, అమ్మాయి తల్లి కూడా అబ్బాయితో మాట్లాడటం ప్రారంభించింది. మొదట్లో కుటుంబ సభ్యులకు దీని గురించి ఏమీ అనుమానం రాలేదు.. కానీ క్రమంగా సంభాషణ సమయం పెరగడం, ప్రవర్తనలో మార్పు రావడం చూసి కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. దీంతో అమ్మాయి కుటుంబం వారి కుమార్తెకు అబ్బాయితో ఉన్న సంబంధాన్ని తెంచుకుంది. దీని తరువాత ఆ అమ్మాయి వివాహం వేరే వారితో  నిశ్చయించారు.  మే నెలలో పెళ్లి నిర్ణయించారు. అయితే అబ్బాయి, మిస్సయిన అత్త మధ్య సంభాషణలు యథావిధిగా కొనసాగాయి. దీంతో మూడు రోజుల క్రితమే ఆ యువకుడు తన కాబోయే అత్తగారితో కలిసి ఇంటి నుంచి పారిపోయాడని పోలీసులు తెలిపారు..

ఇది కూడా చూడండి:Pahalgam Terror Attack : పహల్గాం ఉగ్రదాడిలో కీలక పరిణామం..జిప్ లైన్ ఆఫరేటర్ పై ఎన్ఐఏ ఫోకస్

నలుగురికి తెలిస్తే పరువు పోతుందని భావించిన కుటుంబం మొదట స్వయంగా వెతికింది, కానీ ఎటువంటి ఆధారాలు దొరకకపోవడంతో, పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారిద్దరి కోసం గాలిస్తున్నామని, త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. యువకుడు, మహిళ కోసం వెతకడానికి బృందాలను ఏర్పాటు చేశారు. మొబైల్ లొకేషన్లను స్కాన్ చేస్తున్నట్లు తెలిపారు.

ఇది కూడా చూడండి:Waqf Board Assets: వక్ఫ్‌ ఆస్తులు ఆ రాష్ట్రంలోనే ఎక్కువ.. కేంద్రం కీలక ప్రకటన

Advertisment
తాజా కథనాలు