Maoist: ఛత్తీస్‌ఘడ్ దండకారణ్యంలో భద్రతా బలగాలు సర్జికల్ స్ట్రైక్ నిర్వహిస్తున్నాయి. బస్తర్ రేంజ్ అటవి పరిధిలోని బీజాపూర్, కరవగుట్ట ప్రాంతాల్లో మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్నాయి. దీంతో తెలంగాణ, ఛత్తీస్‌ఘడ్, ఓరిస్తా, ఆంధ్రప్రదేశ్ బార్డర్ పాంత్రాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇప్పటికే 2వేల కేంద్ర బలగాలు తెలంగాణ ములుగు, భద్రాద్రికొత్తగూడెం తదితర ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా.. మరోవైపు దండకారణ్యంలో ఆపరేషన్ కగార్ పేరుతో మిలటరీ బలగాలు వరుస ఎన్ కౌంటర్లు జరుపుతున్నాయి. ఇందులో భాగంగానే యుద్ధభూమిలో ఏం జరుగుతుందో ప్రజలక కళ్లకు కట్టినట్లు చూపించేందుకు RTV ప్రాణాలకు తెగించి సాహసం చేస్తోంది. బస్తర్ నుంచి డేరింగ్ రిపోర్టింగ్ చేస్తూ ఎప్పటికప్పుడూ తాజా సమాచారం అందిస్తోంది.
దండకారణ్యంలోకి ఆర్టీవీ బృందం..
అటు పోలీసులు, ఇటు మావోయిస్టుల నిర్భందాన్ని అధిగమించి దండకారణ్యంలోకి ఆర్టీవీ బృందం ప్రవేశించింది. దండకారణ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని తాజా పరిస్థితిని బాహ్య ప్రపంచానికి అందించేందుకు ఎవరూ చేయని సాహసం చేసింది. తెలంగాణ సరిహద్దు దాటి అక్కడినుంచి ద్విచక్రవాహనాలపై మైళ్ల దూరం పర్యటించిన ఆర్టీవీ బృందం.. సైనిక శిబిరాలను దాటుకుని మావోయిస్టు అతి తీవ్ర ప్రభావిత ప్రాంతాలను నిశితంగా గమనించింది. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు మడ్వి హిడ్మా కోసం భద్రతాబలగాలు నూతనంగా ఏర్పాటుచేసిన సైనిక శిబిరాలను సందర్శించింది. ఆకాశంలో డ్రోన్లతో రహదారులపై రోడ్ ప్రొటెక్షన్ ఫోర్స్ అడవులను జల్లెడపడుతున్న వేలాది మంది పారామిలిటరీ బలగాలతో భద్రతా బలగాలు పహారా కాస్తుండటం స్పష్టంగా గమనించి వీడియోలు తీసింది.
ఇది కూడా చదవండి: Imran Khan: చనిపోయే వరకు ఇక్కడే ఉంటా.. ఇమ్రాన్ ఖాన్ సంచలన ప్రకటన
అంతేకాదు వామపక్ష తీవ్రవాదాన్ని అణచివేసేందుకు బహుముఖ వ్యూహంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమంపై ఆరా తీసింది. మావోయిస్టులు, భద్రతా బలగాల కాల్పుల్లో వినియోగించిన రాకెట్ లాంఛర్ లను భద్రతాబలగాలు వినియోగిస్తున్న ఆయుధ సామాగ్రిని జనాలకు కళ్లకు కట్టినట్లుగా చూపించింది.
ఇది కూడా చదవండి: HYDRA: ప్రతి సోమవారం హైడ్రా ప్రజావాణి.. ఈ నంబర్లకు కాల్ చేయండి!