NIA: అల్‌ఫలా యూనివర్సిటీ.. రూమ్‌ నెంబర్ 13లో ఉగ్రకుట్రకు ప్లాన్

ఢిల్లీలో ఎర్రకోట పేలుడు ఘటన దర్యాప్తులో రోజురోజుకి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అల్‌ఫలా యూనివర్సిటీకి చెందిన పలువురు వైద్యులు దేశవ్యాప్తంగా నాలుగు నగరాల్లో ఉగ్ర దాడులకు ప్లాన్‌ వేసినట్లు తెలిసింది.

New Update
Room No. 13, Diary and code words, NIA digging deep into Delhi blast ploy

Room No. 13, Diary and code words, NIA digging deep into Delhi blast ploy

ఢిల్లీలో ఎర్రకోట పేలుడు(delhi blast) ఘటన దర్యాప్తులో రోజురోజుకి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అల్‌ఫలా యూనివర్సిటీ(AL FALAH UNIVERSITY) కి చెందిన పలువురు వైద్యులు దేశవ్యాప్తంగా నాలుగు నగరాల్లో ఉగ్ర దాడులకు ప్లాన్‌ వేసినట్లు తెలిసింది. ఈ దాడులను అమలు చేసేందుకు 8 సూసైడ్‌ బాంబర్లను కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ కేసులో నిందితులుగా ఉన్న డా.ఉమర్ నబీ, డా.ముజమ్మిల్‌ డైరీలో ఉగ్రదాడులకు వేసిన ప్లాన్‌ను గుర్తించామని దర్యాప్తు వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఉగ్ర కుట్రలకు సంబంధించి దర్యాప్తు చేపట్టిన అధికారులు.. అల్‌ఫలా వర్సిటీకి చెందిన డా.ముజమ్మిల్‌తో పాటు డా.షాహిన్‌, డా. అదీల్ అహ్మద్ రథర్, డా.అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ సహా మరికొందరిని అరెస్టు చేశారు. 

Also Read: అల్-ఫలాహ్ యూనివర్సిటీకి బిగ్ షాక్..NAAC ఏం చేసిందంటే?

NIA Digging Deep Into Delhi Blast Ploy

మరోవైపు ఢిల్లీ పేలుడు ఘటన తర్వాత హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఉన్న అల్‌ఫలా యూనివర్సిటీ పేరు సంచలనంగా మారింది. ప్రస్తుతం అక్కడ దర్యాప్తు బృందాలు తనిఖీలు చేపడుతున్నాయి. అయితే ఆ వర్సిటీలోని మెడికల్ కాలేజీలో ఉన్న 17వ నెంబర్‌ బిల్డింగ్‌ ఉగ్ర కార్యకలాపాలకు కేంద్రంగా మారినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. ఇందులో ముజమ్మిల్‌కు చెందిన 13వ నెంబర్‌ రూమ్‌లోనే ఉగ్ర కుట్రలకు ప్లాన్‌ వేసినట్లు దర్యాప్తులో తేలింది. 

Also Read:  సర్వే సంస్థలని 2సార్లు బురిడీ కొట్టించిన బిహారీలు.. ఎగ్జిట్ పోల్స్ తారుమారు.. మరీ ఈసారి!?

యూనివర్సిటీ ల్యాబ్ నుంచి కొన్ని కెమికల్స్ తీసుకురావాలని ఉమర్‌, ముజమ్మిల్‌ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ రూమ్‌లో సోదాలు జరిపిన పోలీసులు కొన్ని రసాయనాలు, డిజిటల్ పరికరాలు, పెన్‌డ్రైవ్‌లను స్వాధీనం చేసుకున్నారు. ముజమ్మిల్‌ రూమ్‌తో పాటు ఉమర్‌కు చెందిన 4వ నెంబర్‌ రూమ్ నుంచి కూడా మూడు డైరీలు అధికారులు దొరికాయి. అందులో 25 మంది వ్యక్తుల పేర్లు ఉన్నాయి. వాళ్లందరూ కూడా జమ్మూకశ్మీర్‌, ఫరీదాబాద్‌కు చెందిన వాళ్లేనని గుర్తించారు. ఆ డైరీలలో నవంబర్‌ 8 నుంచి 12 వరకు తేదీలు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. దేశంలో నాలుగు కీలకమైన ప్రాంతాల్లో ఒకేసారి దాడులు జరపాలని ఈ నిందితులు ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనపై ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. 

Advertisment
తాజా కథనాలు