RG Kar Rape-Murder Case: నేను ఏ తప్పూ చేయలేదు.. సంజయ్ రాయ్‌ బిగ్ ట్విస్ట్

కోల్‌కతా డాక్టర్‌ హత్యాచార నిందితుడు సంజయ్ రాయ్‌ కోర్టులో కోర్టులో బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు..  తాను నిర్దోషిని కోర్టులో చెప్పుకొచ్చాడు.  తనతో పోలీసులు  బలవంతంగా సంతకం చేయించారని తెలిపాడు.  నేరానికి పాల్పడినట్టు ఒప్పుకోవాలని ఒత్తిడి తెచ్చారని  తెలిపాడు.

author-image
By Krishna
New Update
sanjay roy

sanjay roy Photograph: (sanjay roy )

RG Kar Rape-Murder Case: కోల్‌కతా డాక్టర్‌ (Kolkata Junior Doctor) హత్యాచార నిందితుడు సంజయ్ రాయ్‌ శిక్ష ఖరారుపై  సీల్దా కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. ఈ కేసును దర్యాప్తు చేసిన సీబీఐ సంజయ్ రాయ్‌(Sanjay Roy)కి ఉరిశిక్ష విధించాలని వాదిస్తోంది. అతనికి ఉరిశిక్షనే సరైనదని సీఎం మమతా బెనర్జీ(CM Mamata Banerjee) సైతం ట్వీట్ చేశారు. ఉరిశిక్ష వేయాలన్న డిమాండ్ ను  సంజయ్ రాయ్‌ న్యాయవాది తొసిపుచ్చారు.  

Also Read :  ఎంత పని చేశార్రా.. మైనర్ బాలుడిపై స్నేహితులు లైంగిక దాడి!

నిందితుడు  సంజయ్ రాయ్‌ కోర్టులో బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు..  తాను నిర్దోషిని కోర్టులో చెప్పుకొచ్చాడు.  తనతో పోలీసులు  బలవంతంగా సంతకం చేయించారని తెలిపాడు. తాను రుద్రాక్షమాల ధరిస్తానని...  తాను తప్పు చేసి ఉంటే రుద్రాక్ష పూసలు తెగిపోయి ఉండాలన్నాడు.  తనను కావాలనే ఈ కేసులో ఇరికించారని..  నేరానికి పాల్పడినట్టు ఒప్పుకోవాలని ఒత్తిడి తెచ్చారని  తెలిపాడు. తనను ఓ ఐపీఎస్ అధికారి ఇందులో ఇరికించాడంటూ సంచలనల ఆరోపణలు చేశాడు. ఒకవైపు తాను తప్పు చేయలేదు అంటూనే తనకు మారే అవకాశం ఇవ్వాలని సంజయ్ రాయ్‌ కోర్టును కోరారు.  ఉరిశిక్ష కాకుండా మరెదైనా శిక్షను విధించాలని కోరాడు.  మరికాసేపట్లో కోర్టు శిక్షను ఖరారు చేయనుంది.  

Also Read :  అమెరికాలలో కాల్పులు.. హైదరాబాద్ విద్యార్థి మృతి

Kolkata Junior Doctor Rape Case

Also Read :  యూట్యూబ్‌లో వీడియో చూసి బ్యాంకు దొంగతనానికి .. పాపం చివరికి!

2024 ఆగస్టు 9న ఆర్జీకర్‌ మెడికల్‌ కళాశాల (RG Kar Medical College) లో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్‌పై.. పోలీస్‌ వాలంటీర్‌గా పనిచేస్తున్న సంజయ్‌ రాయ్‌ (Sanjay Rai) అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన అనంతరం దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. సంజయ్‌ రాయ్‌ను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశాయి. చివరికి ఘటన జరిగిన 162 రోజుల తర్వాత ఈ కేసులో తీర్పు వచ్చింది.

Also Read :  ఈ వారం థియేటర్, ఓటీటీలో సినిమాల జాతర! ఇందులో మీ ఫేవరేట్ ఏంటి?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు