this week movies list
Cinema: సంక్రాంతికి విడుదలైన సినిమాల సందడి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంతలోనే మరికొన్ని సినిమాలు, సీరీస్ లు ఓటీటీ, థియేటర్ ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నాయి. ఈ వారం ఓటీటీ, థియేటర్ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..
ఈ వారం ఓటీటీ, థియేటర్ సినిమాలు
గాంధీ తాత చెట్టు
డైరెక్టర్ సుకుమార్ కుమార్తె సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'గాంధీ తాత చెట్టు'. పద్మావతి మల్లాది తెరకెక్కించిన ఈ చిత్రం అనేక అవార్డులను సొంతం చేసుకుంది. ‘దాదాసాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్’ లో ఉత్తమ డెబ్యూ యాక్ట్రెస్ గా సుకృతి అవార్డు అందుకుంది. ఈ సినిమా ఈనెల 24న థియేటర్స్ లో విడుదల కానుంది.
స్కైఫోర్స్
అక్షయ్ కుమార్, సారా అలీఖాన్, నిమ్రత్ కౌర్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ 'స్కైఫోర్స్'. ఇందులో అక్షయ్ కుమార్ వింగ్ కమాండర్ గా కనిపించనున్నారు. భారతదేశ తొలి వైమానిక దాడి నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని సందీప్ కేవ్లానీ తెరకెక్కించారు. ఇది ఈనెల 24న రిలీజ్ కానుంది.
ఐడెంటిటీ
టొవినో థామస్, త్రిష ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ 'ఐడెంటిటీ'. ఈనెల 24న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే మలయాళ వెర్షన్ లో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
డియర్ కృష్ణ
దినేశ్‌బాబు దర్శకత్వంలో మమితా బైజు, అక్షయ్, ఐశ్వర్య లీడ్ రోల్స్ లో నటించిన చిత్రం 'డియర్ కృష్ణ'. ఈ చిత్రం కూడా ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
హత్య
ధన్య బాలకృష్ణ, పూజా రామచంద్రన్, రవి వర్మ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'హత్య'. ఈ సినిమా ఈ నెల 24న రిలీజ్ కానుంది.
నెట్ ఫ్లిక్స్
- ది నైట్ ఏజెంట్ సీజన్ 2: జనవరి 23
ది సాండ్ క్యాసిల్: జనవరి 24 - రజాకార్: ఆహా (జనవరి 22 నుంచి)
- విడుదల 2: అమెజాన్ ప్రైమ్ వీడియో(స్ట్రీమింగ్ అవుతోంది)
- వైఫ్ ఆఫ్: ఈటీవీ విన్ ( జనవరి 23 నుంచి)
Also Read: Actor Rangaraju: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు రంగరాజు మృతి