సోనియా గాంధీ తీసుకున్న నెహ్రూ లేఖలు అప్పగించండి: కేంద్రం

తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ రాసిన లేఖలకు సంబంధించిన అంశం చర్చనీయాంశమవుతోంది. ఆ లేఖలను తిరిగి అప్పగించాలని ప్రైమ్‌ మినిస్టర్స్‌ మ్యూజియం అండ్‌ లైబ్రరీ కోరింది. ఈ మేరకు విపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి లేఖ రాసింది.

New Update
Nehru letters

భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ రాసిన లేఖలకు సంబంధించిన అంశం చర్చనీయాంశమవుతోంది. ఆ లేఖలను తిరిగి అప్పగించాలని ప్రైమ్‌ మినిస్టర్స్‌ మ్యూజియం అండ్‌ లైబ్రరీ (PMML) కోరింది. ఈ మేరకు విపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి లేఖ రాసింది. ఈ లేఖలను 2008లో కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ తీసుకున్నారని.. వీటిని తిరిగి అప్పగించే విషయంలో తమకు సహకరించాలని కోరింది. 

Also Read: వారానికి 70 గంటలు పనిచేయాల్సిందే.. మరోసారి బాంబు పేల్చిన నారాయణమూర్తి

నెహ్రూ రాసిన ఆ లేఖలను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 1971లో నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీకి అప్పగించింది. కానీ 2008లో వాటిని సోనియాగాంధీకి అప్పగించింది. మొత్తం 51 బాక్సుల్లో ప్యాక్‌ చేసిన లేఖలను ఆమెకు పంపించింది. దీంతో అప్పటినుంచి అవి ఆమె వద్దే ఉంటున్నాయి. అయితే వాటిని అప్పగించాలని ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే పీఎంఎంఎల్‌ కోరింది. డిసెంబర్ 10న రాహుల్‌గాంధీని కూడా కోరింది. కనీసం ఫొటో కాపీస్ లేదా డిజిటల్ కాపీస్ అయినా తమకు అప్పగించాలని అభ్యర్థించింది. 

Also Read: Maharashtra లో మంత్రివర్గ విస్తరణ.. 39 మంది MLAలు మంత్రులుగా ప్రమాణం

జవహర్‌లాల్‌ నెహ్రూ, ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, జయప్రకాశ్‌ నారాయణ్, పద్మజా నాయుడు, ఎడ్వినా మౌంట్‌బాటెన్‌, అరుణా అసఫ్ అలీ, బాబు జగ్జీవన్ రామ్‌,విజయ లక్ష్మీ పండిట్‌, గోవింద్ వల్లభ్ పంత్ మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు వాటిలో ఉన్నాయి. ఇదిలాఉండగా.. దేశ నిర్మాణంలో కీలకభూమిక పోషించిన ప్రధానమంత్రుల జ్ఞాపకాలతో ప్రధాని సంగ్రహాలయాన్ని కేంద్రం నిర్వహిస్తోంది.  

Also Read: భూమి లేని నిరుపేదలకు గుడ్ న్యూస్.. ఏటా రూ.12 వేలు

Also Read: మాజీ అధ్యక్షుడు అసద్ అరాచకాలు..బందీలను పెంపుడు సింహాలకు ఆహారం

Advertisment
తాజా కథనాలు