భారత్ అభివృద్ధి చెందాలంటే యవత వారానికి 70 గంటల పాటు పనిచేయాలని గతంలో ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు, ఐటీతో సహా ఇతర ఉద్యోగులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే తాజాగా నారాయణమూర్తి మరోసారి తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. వారానికి 70 గంటల పాటు పని చేయకుంటే దేశంలో ఉన్న పేదరికాన్ని ఎలా అధిగమించగలమంటూ ప్రశ్నించారు. Also Read: భర్తను హతమార్చిన భార్య.. పెళ్లయిన నాలుగు రోజులకే.. ఇక వివరాల్లోకి వెళ్తే పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో నారాయణమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. '' మేము ఇన్ఫోసిస్‌ను ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ కంపెనీలతో పోలుస్తాం. అలా పోల్చినప్పుడు భారతీయులు చేయాల్సింది చాలాఉందని అనిపిస్తుంది. భారత్‌లో ఇంకా 80 కోట్ల మంది ఉచిత రేషన్ తీసుకుంటున్నారు. దీన్నిబట్టి చూస్తే ఇంకా 80 కోట్ల మంది పేదరికంలో ఉన్నట్లేగా. అందుకే మన ఆశలు, లక్ష్యాలు ఉన్నతంగా ఉంచుకోవాలి. Also Read: Maharashtra లో మంత్రివర్గ విస్తరణ.. 39 మంది MLAలు మంత్రులుగా ప్రమాణం వారానికి 70 గంటల పాటు పనిచేయకపోతే పేదరికాన్ని మనం ఎలా అధిగమించగలం ? కష్టపడి పనిచేసే పరిస్థితిలో మనం లేకపోతే ఇంకెవరు పనిచేస్తారు ?. భవిష్యత్తు కోసం మనమందరం కలిసి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని'' నారాయణమూర్తి అన్నారు. ఇదిలాఉండగా గతంలో ఇన్ఫోసిస్ మాజీ CFO మోహన్‌దాస్ పాయ్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ది రికార్డ్ అనే పొడ్‌కాస్ట్‌లో తొలి ఎపిసోడ్‌లో నారాయణమూర్తి మాట్లాడారు. Also Read: వెయ్యి మందికి పైగా.. బీభత్సం సృష్టిస్తున్న ఛీడో తుపాను ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో ఉత్పాదక తక్కువగా ఉందని చెప్పారు. అందుకే యువత వారానికి 70 గంటల పాటు పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీ దేశాలు ఇలానే కష్టపడ్డాయంటూ వ్యాఖ్యానించారు. ఆయన చేసిన వ్యాఖ్యలను చాలామంది విమర్శించారు. మరికొందరు బాస్‌లు మాత్రం ఆయన్ని సమర్థించారు. Also Read: గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు.. 69 మంది మృతి