సోనియా గాంధీ తీసుకున్న నెహ్రూ లేఖలు అప్పగించండి: కేంద్రం
తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ రాసిన లేఖలకు సంబంధించిన అంశం చర్చనీయాంశమవుతోంది. ఆ లేఖలను తిరిగి అప్పగించాలని ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీ కోరింది. ఈ మేరకు విపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి లేఖ రాసింది.