/rtv/media/media_files/2025/01/25/5sN5F5Fu4ESiqcvnDlTT.jpg)
Republic Day 2025 flag code
Republic Day 2025: భారతీయులం మన 76వ గణతంత్ర దినోత్సవాన్ని ఈ జనవరి 26న జరుపుకోబోతున్నాం. రాజ్యాంగం ఆమోదించబడిన 1950 జనవరి 26న మొదటిసారి భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిన గణతంత్ర దినోత్సవ వేడుకలు కర్తవ్య మార్గంలో జరుగుతున్నాయి. మన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు గణతంత్ర దినోత్సవం ఒక చారిత్రక ఘట్టాన్ని సూచిస్తుంది. అయితే రిపబ్లిక్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా పాఠశాలలు, కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో జెండాను ఆవిష్కరిస్తారు. జెండాలో ఉన్న మూడు రంగులు ఐక్యత, నిజం, శాంతి, ధైర్యం, త్యాగం, స్ఫూర్తి దేశ శ్రేయస్సు పట్ల ప్రజల అంకితభావం, నిబద్ధతను సూచిస్తాయి. 24-స్పోక్ వీల్ అశోక చక్రం జాతీయతకు మార్గనిర్దేశం చేస్తుంది. అలాంటి విలువలు కలిగివున్న జాతీయ జెండాను ఆవిష్కరించే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి పాటించాలి.
జాతీయ జెండా కోడ్:
* ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా ప్రకారమే పౌరులు జాతీయ జెండాను ఎగురవేయాలి.
* జాతీయ జెండా తప్పనిసరిగా దీర్ఘచతురస్రాకారంలో ఉండాలి. పొడవు-వెడల్పు నిష్పత్తి 3:2.
* పాడైపోయిన లేదా చెదిరిపోయిన జెండాలను ప్రదర్శించకూడదు.
* జెండా ఎగరవేయడమే కాదు దించేటపుడు భూమిని తాకకుండా చూడాలి.
* దీనిని దుస్తులుగా ఉపయోగించకూడదు.
* సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఎగురవేయాలి.
* జెండాను త్రిభుజం ఆకారంలో మడిచి గౌరవప్రదంగా దాచిపెట్టాలి.
* రాత్రిపూట ఎగరినట్లయితే లైట్ వెలుతురు తప్పనిసరి ఉండాలి.
* రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని వంటి ప్రముఖుల వాహనాలపై తప్ప దీనిని మరే వాహనాలపై ప్రదర్శించకూడదు.
చేయవలసినవి:
పౌరులు, ప్రైవేట్ సంస్థలు, విద్యా సంస్థలు అన్ని రోజులలో జెండాను ఎగురవేయవచ్చు. అయితే అది సందర్భానుసారానికి కట్టుబడి ఉంటుంది. విద్యాసంస్థలు ప్రతిరోజు జెండా గౌరవాన్ని చాటిచెప్పేందుకు ఎగురవేయవచ్చు. కానీ సాధ్యమైనంత వరకు స్వాతంత్ర్య దినోత్సవం వంటి జాతీయ సాంస్కృతిక సందర్భాలలో జెండాను ప్రముఖంగా ప్రదర్శించాలి. ఎగురవేసే సమయంలో కుంకుమపువ్వు రంగు ఎల్లప్పుడూ పైభాగంలో ఉండాలి. జెండాను ఎగురవేయడం, దించడం కోసం సరైన ప్రోటోకాల్‌ను అనుసరించాలి. ఈ చర్యల సమయంలో దానికి వందనం చేయడం తప్పనిసరి అని మరవకూడదు.
ఇది కూడా చదవండి: Khammam: మిర్చితోటలో కోటీశ్వరుడి మృతదేహం.. తాళ్లతో కట్టి, కొట్టి చంపి!
చేయకూడనివి:
* జెండా నేలను, నీటిని తాకకూడదు లేదా దుస్తులు లేదా అలంకరణగా ఉపయోగించకూడదు.
* ఇది మతపరమైన ప్రయోజనాల కోసం లేదా టేబుల్ క్లాత్, రుమాలు లేదా ఒక వస్తువుగా వినియోగించకూడదు.
* జెండాను సగం ఎత్తులో ఎగురవేయకూడదు.
* పువ్వులు లేదా చిహ్నాలు వంటి వస్తువులను జెండాపై ఉంచకూడదు.
ఇది కూడా చదవండి: Yamini: హిందువా? ముస్లిమా? అద్దె ఇంటి కోసం స్టార్ హీరోయిన్ తిప్పలు!