RBI Governor : ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ కు గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయనను చెన్నై అపోలో ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని.. ప్రస్తుతం తమ పర్యవేక్షణలో ఉన్నారని వైద్యులు చెప్పారు. కాగా ఆయన ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.ఒడిశా రాష్ట్రానికి చెందిన శక్తికాంత దాస్ ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 25వ గవర్నర్‌గా పనిచేస్తున్నారు. RBI గవర్నర్ బాధ్యతలు చేపట్టకముందు పదిహేనవ ఆర్థిక సంఘంతో పాటు G20 కి భారతదేశం షెర్పా సభ్యుడిగా ఉన్నారు. దాస్ తమిళనాడు కేడర్‌కు చెందిన రిటైర్డ్ 1980 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారి. IAS అధికారిగా తన కెరీర్‌లో తమిళనాడు ప్రభుత్వాలకు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి , రెవెన్యూ కార్యదర్శి , ఎరువుల కార్యదర్శి వంటి వివిధ హోదాల్లో పనిచేశారు.
Also Read: అదానీకి మరో షాక్..పెట్టుబడులు పెట్టేందుకు నిరాకరించిన టోటల్ ఎనర్జీస్
Also Read: Russian Plane: విమానం ల్యాండ్ అవుతుండగా ఇంజిన్‌లో మంటలు.. చివరికీ
వైద్యులు కీలక ప్రకటన...
గవర్నర్ శక్తికాంత్ దాస్ ఆరోగ్యానికి సంబంధించి అపోలో వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని.. త్వరలో డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. నిన్న రాత్రి ఛాతిలో నొప్పి రావడం వల్ల గుండెపోటు వచ్చిందనే అనుమానంతో శక్తికాంత్ దాస్ ఆసుపత్రిలో చేరారని పేర్కొంది. ఆయనకు వచ్చింది గుండెపోటు కాదని ఎసిడిటీ వల్ల ఛాతిలో నొప్పి వచ్చిందని.. ఆయనను వైద్యుల పర్యవేక్షణలో ఉంచి అన్ని రకాల పరీక్షలు చేశామని చెప్పారు. ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని.. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపింది.
Also Read: IPL: ముగిసిన ఐపీఎల్ వేలం.. ఫ్రాంఛైజీలు ఎంత ఖర్చు పెట్టాయి అంటే..