/rtv/media/media_files/2025/11/20/prabhas-2025-11-20-06-56-52.jpg)
Prabhas
Prabhas: 'బాహుబలి: ది ఎపిక్'(Baahubali The Epic) రీ-రిలీజ్ కోసం ప్రభాస్ జపాన్‌కి వెళ్లనున్నారని వస్తున్న వార్తలు అభిమానుల్లో ఆసక్తి రేపుతున్నాయి. గత సంవత్సరం 'కల్కి 2898 AD' ప్రత్యేక స్క్రీనింగ్ కోసం జపాన్‌కి వెళ్లాల్సిన ప్రభాస్, అప్పుడు ఆయనకు కాలు గాయం కావడంతో ఆ ట్రిప్ క్యాన్సిల్ అయ్యింది. ఈ సారి మాత్రం అభిమానులను నిరాశపరచకుండా తప్పకుండా జపాన్‌కి వెళ్లాలని ప్రభాస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
డిసెంబర్ 5, 6 తేదీల్లో జపాన్ యాత్ర (Prabhas Japan Visit)
సమాచారం ప్రకారం ప్రభాస్ డిసెంబర్ 5, 6 తేదీల్లో జపాన్ చేరి, ‘బాహుబలి: ది ఎపిక్’ 4K రీ–రిలీజ్ ప్రమోషన్స్‌లో పాల్గొనబోతున్నారు. అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఈసారి ఆయన షెడ్యూల్‌లో మార్పులు ఉండకూడదని కోరుకుంటున్నారు. టోక్యోలోని 109 Cinemas Kiba, Marunouchi Piccadilly వంటి థియేటర్లలో ప్రభాస్, నిర్మాత శోభు యార్లగడ్డ స్టేజ్ గ్రీటింగ్స్‌లో పాల్గొంటారు. జపాన్‌లో ఈ చిత్రం పూర్తి స్థాయి రిలీజ్ డిసెంబర్ 12న ఉండగా, స్పెషల్ టికెట్లు నవంబర్ 22 నుంచే అందుబాటులోకి వస్తున్నాయి.
జపాన్ ప్రేక్షకుల కోసం..
ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సిరీస్ జపాన్‌లో ఇంతకుముందు కూడా భారీ ఆదరణ పొందింది. చిత్రంలోని గ్రాఫిక్స్, యుద్ధ సన్నివేశాలు, కథకి సంబంధించిన ఎమోషన్స్ జపాన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
Also Read: ప్రభాస్ ప్రాజెక్ట్స్ నుండి అందుకే తప్పుకున్నా: దీపికా పదుకొణె
ఇప్పుడు రీ-రిలీజ్‌గా వచ్చిన ‘బాహుబలి: ది ఎపిక్’ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సుమారు ₹39.75 కోట్లు వసూలు చేసింది. ఇందులో భారత్‌లోనే సుమారు ₹33.45 కోట్లు రావడం విశేషం. ఈ సారి కూడా జపాన్‌లో మంచి వసూళ్లు రావాలని చిత్రబృందం ఆశిస్తోంది.
Also Read: కథ చెబుతానని పిలిచి ఆ డైరెక్టర్ బలవంతం చేసాడు: మౌనీ రాయ్
‘ది రాజా సాబ్’ ప్రమోషన్స్ షురూ! (The Raja Saab Promotions)
ఇటీవల ప్రభాస్ తన కొత్త సినిమా ‘ది రాజా సాబ్’ (దర్శకుడు మారుతి) షూటింగ్ భాగాన్ని పూర్తి చేశారు. జపాన్‌కి వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత హను రాఘవపుడి దర్శకత్వం వహిస్తున్న యుద్ధ నేపథ్యంలో ‘ఫౌజీ’ సినిమా షూటింగ్‌ను కొనసాగించనున్నారు.
Also Read: పైరసీ చేసే కొడు*కుల్ని ఎన్ కౌంటర్ చేయాలి: నిర్మాత సి. కళ్యాణ్
డిసెంబర్‌లో భారత్‌కు వచ్చిన వెంటనే ‘ది రాజా సాబ్’ ప్రమోషన్స్‌ను ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా పెద్ద ప్రచార కార్యక్రమం ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా జనవరి 9, 2026న పాన్ ఇండియా రిలీజ్‌కి సిద్ధమవుతోంది.
Follow Us