HP Rain : హిమాచల్‌ప్రదేశ్‌లో మళ్లీ క్లౌడ్ బస్ట్...ఎడతెరిపిలేని వానలతో ఉక్కిరిబిక్కిరి..!!
హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బియాస్ నది ఉప్పొంగుతోంది. సోలన్‌లోని జాడోన్ గ్రామంలో క్లౌడ్ బస్ట్ తో ఐదుగురు మరణించారు. ముగ్గురు అదృశ్యమయ్యారు. వరద కారణంగా జిల్లాలో గోశాల, రెండు ఇళ్లు కొట్టుకుపోయాయి. ధరంపూర్‌లోని తాన్యాహాద్ పంచాయతీలోని నల్యానాలో మురుగునీరు ఇంట్లోకి చేరడంతో ముగ్గురు జలసమాధి అయినట్లు సమాచారం.