/rtv/media/media_files/2025/09/23/indian-railways-2025-09-23-17-29-12.jpg)
Indian Railways
దేశంలో ప్రతిరోజూ లక్షలాది మంది రైలు ప్రయాణాలు చేస్తుంటారు. అప్పుడప్పుడు రైలు ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు భారీగా ప్రాణనష్టం ఉంటుంది. అయితే రైల్వేశాఖ ఇంకా పాత విధానంలోనే సిగ్నలింగ్ వ్యవస్థను అమలు చేస్తోంది. ఈ విధానం వల్ల ఓ ట్రాక్‌పై వెళ్లే రైలు తర్వాతి స్టేషన్‌ను దాటే దాకా ఈ ట్రాక్‌పై మరో రైలును అనుమతించరు. దీనివల్ల రైలు ప్రయాణాల్లో ఆలస్యం జరుగుతోంది. ఈ క్రమంలోనే దీన్ని నివారించేందుకు రైల్వేశాఖ ఓ కొత్త ఆటోమేటిక్ సిగ్నలింగ్ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది.
Also Read: ప్రాణం తీసిన అనుమానం.. భార్యను కూతురు ముందే పొడిచి పొడిచి.. ఆ భర్త ఎలా చంపాడంటే..?
రైల్వే అధికారి నవీన్ కుమార్ కొత్త సిగ్నలింగ్ వ్యవస్థ గురించి వివరించారు. '' ఈ కొత్త సిస్టమ్‌లో ఒక స్టేషన్ నుంచి మరొక స్టేషన్‌కు సిగ్నల్స్ క్రమం తప్పకుండా చేరుతాయి. దీంతో ఒక రైలు సిగ్నల్ దాటగానే మరో రైలు వెంటనే సిగ్నల్ అందుకుని ట్రాక్‌పైకి వస్తుంది. గతంలో మొదటి రైలు బ్లాక్ సెక్షన్ దాటేదాకా ఇంకో రైలు వెళ్లేందుకు పర్మిషన్ ఉండేది కాదు. కొత్త సాంకేతికత వలల్ తక్కువ సమయంలో ప్రయాణికులకు ఎక్కువ రైళ్లను అందుబాటులోకి తీసుకురావొచ్చు.
Also Read: నిరుద్యోగులకు దసరా కానుక.. 7,565 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. వివరాలివే!
అంతేకాదు ఈ ఆటోమేటిక్ సిస్టమ్ వల్ల రైలు ప్రమాదాలు తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఇటీవల తూర్పు కోస్ట్ రైల్వే తాల్చేర్‌పరదీప్ ఫ్రైట్ కారిడర్‌లో కటక్‌పరదీప్ ప్రాంతాల మధ్య ఈ అత్యాధునిక సిగ్నలింగ్ సిస్టమ్ వ్యవస్థను సక్సెస్‌ఫుల్‌గా ప్రారంభించారు. ఈ ఆటోమేటిక్ సిగ్నలింగ్ సిస్టమ్ ద్వారా రైల్వే సేవల కోసం మానవులపై ఆధారపడటం తగ్గుతుంది. అలాగే ప్రయాణికుల భద్రత, రైలు ప్రమాదాలు కూడా తగ్గుతాయి. రైళ్లు ఆలస్యం కాకుండా సరైన టైమ్‌కు చేరుకునే అవకాశాలు ఉంటాయి. వాణిజ్యానికి సంబంధించి ఎగుమతులు, దిగుమతులు కూడా వెంటనే జరుగుతాయి. దీనివ్లల దేశ ఆర్థిక పరిస్థితి కూడా పురోగతి సాధిస్తుందని'' నవీన్ కుమార్ తెలిపారు.
Also Read: హెచ్ 1-బీ వీసా ఫీజుల నుంచి డాక్టర్లకు మినహాయింపు..ఆలోచనలో ట్రంప్ సర్కార్