VIDEO: కన్నీరు పెట్టించే విషాదం.. ఇంజిన్, బోగీల మధ్య ఇరుక్కుని మృతి

బిహార్‌ బెగుసరాయ్‌లోని బరౌనీ రైల్వే జంక్షన్‌లో విషాదం జరిగింది. రైలు ఇంజిన్‌, బోగీల మధ్య కప్లింగ్‌ను విడదీసే క్రమంలో రైల్వే పోర్టర్‌ అమర్ కుమార్ మధ్యలో ఇరుక్కుని మృతి చెందాడు. ఘటననాంతరం ఆ ట్రైన్‌ లోకోపైలట్‌ అక్కడి నుంచి పరరయ్యాడు.

New Update
bihar barauni railway

బిహార్‌ బెగుసరాయ్‌లోని బరౌనీ రైల్వే జంక్షన్‌లో హృదయవిదారకర ఘటన చోటుచేసుకుంది. రైలు, ఇంజిన్‌, బోగీల మధ్య కప్లింగ్‌ను విడదీసే క్రమంలో వాటి మధ్య నలిగి రైల్వే పోర్టర్‌ మృతి చెందాడు. మృతుడిని అమర్‌ కుమార్‌గా గుర్తించారు. ఘటననాంతరం ఆ ట్రైన్‌ లోకోపైలట్‌ అక్కడి నుంచి పరరయ్యాడు.

Also Read :  సమగ్ర సర్వేపై సర్కార్ అదిరిపోయే శుభవార్త.. ఎక్కడ ఉంటే అక్కడే!

ఇంజిన్, బోగీ మధ్య ఇరుక్కుని

బిహార్‌లో హృదయవిదారకర ఘటన జరిగింది. రైలు ఇంజిన్, బోగీల మధ్యలో ఇరుక్కుని రైల్వే పోర్టర్ మృతి చెందాడు. అదే సమయంలో బయట ప్రయాణికులు అరుపులు అరచినా లోకోపైలట్ వినిపించుకోలేదు. ఇక విషయం తెలిసి డ్రైవర్ అక్కడ నుంచి పరారయ్యాడు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Also Read: మోదీకి రేవంత్ వార్నింగ్.. మహారాష్ట్ర ప్రచారంలో సంచలన వ్యాఖ్యలు!

బీహార్‌ రాష్ట్రం బెగుసరాయ్ జిల్లాలోని బరౌని రైల్వే జంక్షన్‌లో లఖ్‌నవూ- బరౌనీ ఎక్స్‌ప్రెస్‌ రైలు (15204) ఇవాళ ఉదయం బరౌనీ స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్‌ నెంబర్ 5కు చేరుకుంది. అదే సమయంలో విధులు నిర్వర్తిస్తున్న 35 ఏళ్ల రైల్వే ఉద్యోగి అమర్ కుమార్ రైలు ఇంజిన్‌, బోగీల మధ్య కప్లింగ్‌ను విడదీసేందుకు కిందకి దిగాడు.

Also Read: రోడ్డు మీద ఉమ్మివేస్తున్నారా జాగ్రత్తా.. వారి కంటపడితే ఖతమే!

అప్పుడే డీకంప్లింగ్ ప్రక్రియలో లోకే పైలట్ (రైలు డ్రైవర్) ఊహించని విధంగా ఇంజన్‌ను వెనక్కి తిప్పాడు. దీంతో అమర్ ఇంజిన్, బోగిల మధ్య ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే అప్పటికే ప్లాట్ ఫార్మ్ పై ఉన్న ప్రయాణికులు లోకో పైలట్‌ను అప్రమత్తం చేశారు.

ఇది కూడా చూడండి: ఉదయాన్నే గ్రీన్ టీ తాగేటప్పుడు ఈ మిస్టేక్స్ చేస్తున్నారా?

కానీ వినిపించుకోకుండా అతడు ఇంజిన్‌ను వెనక్కి తీసుకొచ్చాడు. విషయం తెలిసి లోకో పైలట్ అక్కడి నుంచి పరారయ్యాడు. అందుకు సంబంధించిన దృశ్యాలను కొందరు తమ ఫోన్ల ద్వారా రికార్డ్ చేశారు. కాగా ఈ ఘటనపై అప్రమత్తమైన సోన్‌పూర్ రైల్వే డివిజన్ సీనియర్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై విచారణకు ఆదేశించారు.

ఈ విషాదకర ఘటనపై స్పందించిన DRM సోన్పూర్.. ‘‘ఇది చాలా దురదృష్టకర సంఘటన. ఇది పని ప్రదేశంలో జరగకూడదు. మేము వెంటనే ఈ కేసుపై అధికారి స్థాయి విచారణకు ఆదేశించాము. మేము బాధితుడి కుటుంబానికి అంత్యక్రియల భత్యాన్ని విడుదల చేసాము. సేవా నిబంధనల ప్రకారం అమర్ కుటుంబానికి పరిహారం చెల్లిస్తాము’’ అని చెప్పారు. 

Advertisment
తాజా కథనాలు