Revanth: సమగ్ర సర్వేపై సర్కార్ అదిరిపోయే శుభవార్త.. ఎక్కడ ఉంటే అక్కడే!

TG: సమగ్ర సర్వేపై సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఆధార్‌ కార్డులో చిరునామా ఉన్న చోటికి, సొంతింటికి, స్వగ్రామానికి వెళితేనే కుటుంబ వివరాలు నమోదు చేస్తారనే అపోహ వద్దని.. ఎక్కడ ఉంటే అక్కడే కుటుంబ సభ్యుల వివరాలని అధికారులకు చెప్పాలని క్లారిటీ ఇచ్చింది.

New Update
caste

Caste Census : ఈరోజు నుంచి తెలంగాణలో రెండో దశ సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమం ప్రారంభమైంది. కుటుంబ సభ్యుల వివరాలను అధికారులు ఇంటి వద్దకే వచ్చి సేకరించనున్నారు. సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ, కులాల సమాచారాన్ని అధికారులు నమోదు చేసుకుంటారు. అయితే.. ఉద్యోగాల నిమిత్తం సొంత గ్రామాన్ని వదిలి వేరే ప్రాంతంలో ఉంటున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం కాస్ట్ వెసలుబాటు కల్పించింది. ప్రజలు ఎక్కడైతే ఉంటే అక్కడే తమ వివరాలను సమర్పించవచ్చని పేర్కొంది. కాగా గత కొన్ని రోజులుగా ఆధార్ కార్డు మీద ఉన్న అడ్రెస్స్ దగ్గరికి వెళ్తేనే వివరాలను అధికారులు నమోదు చేసుకుంటారని జరుగుతున్న ప్రచారంపై  రాష్ట్ర ప్రణాళికశాఖ స్పందించింది. ఆ ప్రచారాన్ని ఖండించింది. 

Also Read :  దాతృత్వంలో శివ్ నాడార్ టాప్.. ఎన్ని కోట్లు విరాళమంటే?

అపోహలు వద్దు...

ఆధార్‌ కార్డులో చిరునామా ఉన్న చోటికి, సొంతింటికి, స్వగ్రామానికి వెళితేనే కుటుంబ వివరాలు నమోదు చేస్తారనే అనుమానాలు వద్దని తెలిపింది. మీరు ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చిన అధికారులకు మీ సమాచారాన్ని ఇస్తే సరిపోతుందని స్పష్టం చేసింది. కుటుంబంలో ఎంత మంది ఉన్నారు?,  కుటుంబ సభ్యుల వ్యక్తిగత ఆధార్ కార్డులు, సెల్‌ఫోన్‌ నంబర్లు, ప్రశ్నపత్రంలో అడిగిన వివరాలన్నీ అధికారులకు ఇవ్వాలని సూచించింది. కాగా ప్రజలు.. ఆధార్, రేషన్‌కార్డు, పట్టాదారు పాసు బుక్, బ్యాంకు పాసు బుక్ వంటివి అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. ఇవి అందుబాటులో ఉంటే సర్వే కోసం వచ్చిన గణకులకు త్వరగా సమాచారం ఇవ్వవచ్చని అధికారులు చెప్పారు. 

Also Read :  నేరుగా ఓటీటీలోనే తమన్నా క్రైమ్ థ్రిల్లర్ విడుదల.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

మొత్తం 1,17,44,954 కుటుంబాలు...

ఈ నెల 6 నుంచి 8 వరకు ఇంటి నంబరు, యజమాని పేరు నమోదు సర్వే పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. 150 నుంచి 175 ఇళ్లను ఒక్కో గణకుడికి అధికారులు కేటాయించారు. మొత్తం మూడు రోజులపాటు వీరు ఇంటింటికి వెళ్లి నంబర్ల నమోదుకు చేశారు. కాగా సర్వే చేసేవాళ్లకు  ప్రభుత్వం కేవలం మూడు రోజుల సమయం మాత్రమే ఇచ్చింది. నిన్నటితో ఈ ప్రక్రియని సర్వేయర్లు విజయవంతంగా పూర్తి చేశారు. ఈరోజు నుంచి ప్రతి ఇంటికీ వెళ్లి ప్రతి కుటుంబంలోని సభ్యులందరి సమగ్ర వివరాల నమోదు చేయనున్నారు. ఈ నెలాఖరు వరకు ప్రభుత్వం సమయం ఇచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 1,17,44,954 కుటుంబాలు ఉన్నాయని, అన్ని ఇళ్లను 87,092 ఎన్యూమరేషన్‌ బ్లాక్‌లుగా విభజించినట్లు ప్రణాళికశాఖ అధికారులు తెలిపారు. 

Also Read :  వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ అరెస్ట్?

Also Read :  అందరికీ దూరంగా ఒంటరిగా.. అరుదైన వ్యాధితో బాధపడుతున్న అర్జున్ కపూర్!

Advertisment
Advertisment
తాజా కథనాలు