/rtv/media/media_files/2025/11/08/vvpat-slips-2025-11-08-17-11-43.jpg)
VVPAT slips found dumped in Bihar's Samastipur,
బీహార్‌లో మొదటి దశ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. రెండో దశ ఎన్నికలు నవంబర్ 11న జరగనున్న నేపథ్యంలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. సమస్తిపూర్ జిల్లా సరైరంజన్ నియోజకవర్గంలోని ఓ చెత్త కుప్పలో పెద్ద సంఖ్యలో VVPAT స్లిప్స్ కనిపించాయి. ఈవీఎంలలో వినియోగించే ఈ స్లిప్స్ కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై స్పందించిన ఆర్జేడీ ఇది ప్రజాస్వామ్య దోపిడీ అంటూ విమర్శించింది. అయితే అవి మాక్ పోల్ స్లిప్స్ అని ఎన్నికల సంఘం తెలిపింది. అలాగే అక్కడి అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ (ARO)ను సస్పెండ్ కూడా చేసింది.
Also Read: ఇజ్రాయిల్, ఇండియా కలిసి పాక్‌పై దాడికి ప్లాన్.. ఇందిరాగాంధీ ఎంట్రీతో సీన్ రివర్స్
ఆర్జేడీ తమ అధికారిక ఎక్స్ ఖాతాలో దీని గురించి ఓ వీడియో పోస్టు చేసింది. సరైరంజన్ నియోజకవర్గంలోని కేఎస్‌ఆర్ కాలేజ్ సమీపంలో రోడ్డుపై చెత్తకుప్పలో VVPAT స్లిప్పులు కనిపించాయని పేర్కొంది. ఈ స్లిప్పులు ఎందుకు, ఎవరి ఆదేశాల మేరకు విసిరివేయబడ్డాయో చెప్పాలని ఆర్జేడీ ప్రశ్నించింది. ఎన్నికల సంఘాన్ని దొంగ అంటూ విమర్శించింది. దీనికి సమాధానం చెబుతారా అంటూ ప్రశ్నించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
समस्तीपुर के सरायरंजन विधानसभा क्षेत्र के KSR कॉलेज के पास सड़क पर भारी संख्या में EVM से निकलने वाली VVPAT पर्चियां फेंकी हुई मिली।
— Rashtriya Janata Dal (@RJDforIndia) November 8, 2025
कब, कैसे, क्यों किसके इशारे पर इन पर्चियों को फेंका गया? क्या चोर आयोग इसका जवाब देगा? क्या यह सब बाहर से आकर बिहार में डेरा डाले लोकतंत्र के… pic.twitter.com/SxOR6dd7Me
ఈ ఘటన వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి, సమస్తిపూర్ జిల్లా కలెక్టర్ రోషన్ కుష్వాహా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఇవి మాక్ పోల్ స్లిప్పులని.. ఓటింగ్‌కు ముందు ఈవీఎంలను పరీక్షించే సమయంలో వీటిని వినియోగిస్తారని అధికారులు తెలిపారు. అయినప్పటికీ ఇలా రోడ్లపై ఆ స్లిప్పులు పడేయడం ఏంటని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
VVPAT స్లిప్పులు అంటే ?
VVPAT స్లిప్ అంటే ఓటరు ధృవీకరించదగిన పేపర్ ఆడిట్ ట్రయిల్ (Voter Verifiable Paper Audit Trail -). ఇది EVMకు జతచేయబడిన ఒక ప్రత్యేక ప్రింటర్ సిస్టమ్. ఓటరు తనకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేశాక లోపల ఓ స్లిప్పు బయటికి వస్తుంది. తాను అనుకున్న అభ్యర్థికి ఓటు పడిందో లేదో నిర్ధరించేందుకు ఆ స్లిప్ కనిపిస్తుంది.
Follow Us