Rahul Gandhi: అంతా మారిపోయింది.. వాళ్లు రాజకీయాల్లోకి రావాలి: రాహుల్‌ గాంధీ

గత పదేళ్లలో ప్రపంచ రాజకీయాలు మారిపోయాయని విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. రాజకీయాల్లోకి కొత్త రావాలని.. అప్పుడే కొత్త ఆలోచనలు వచ్చి.. దేశం అభివృద్ధి వైపు దూసుకెళ్తుందని తెలిపారు.హెచ్‌ఐసీసీలో కొనసాగుతున్న భారత్‌ సమ్మిట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు పాల్గొన్నారు.

New Update
Rahul Gandhi

Rahul Gandhi

హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో కొనసాగుతున్న భారత్‌ సమ్మిట్‌లో కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు కీలక విషయాలు పంచుకున్నారు. '' గత పదేళ్లలో ప్రపంచ రాజకీయాలు మారిపోయాయి. ఆధునిక సోషల్ మీడియాలతో అంతా మారిపోయింది. రాజకీయాల్లోకి కొత్త రావాలి. అప్పుడే కొత్త ఆలోచనలు వచ్చి.. దేశం అభివృద్ధి వైపు దూసుకెళ్తుంది. ఎన్నికలకు ముందు కన్యాకుమారి నుంచి సుమారు 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. 

Also Read: సంచలన అప్‌డేట్.. 48 గంటల్లో పాకిస్తాన్‌పై యుద్ధం !

పాదయాత్ర మొదలుపెట్టే మందు చాలా ఆలోచించాను. దీన్ని ప్రారంభించాకా మళ్లీ వెనకడుగు వేయలేదు. ఆ తర్వాత చాలామంది నాతో కలిసి నడవడం ప్రారంభించారని'' రాహుల్ గాంధీ అన్నారు. మరోవైపు సీఎం రేవంత్ మాట్లాడుతూ.. సమాజంలో అన్న వర్గాల ఆకాంక్షలు నెరవేర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇందుకోసం రాష్ట్రంలో అనేక పథకాలు తీసుకొచ్చామని తెలిపారు. '' దేశంలో అతిపెద్ద రుణమాఫీ కార్యక్రమం ఇక్కడే చేపట్టాం. ఇప్పటిదాకా రూ.20 వేల కోట్లు రుణమాఫీ చేశాం. 

Also Read: 'పాకిస్థాన్‌కి వెళ్తే చంపేస్తారు, మేమిక్కడే ఉంటాం'.. పాక్ కుటుంబాల ఆవేదన

రైతు భరోసా కింద ఎకరానికి రూ.12 వేలు అందిస్తున్నాం. వరికి మద్దతు ధరతో సహా రూ.500 బోనస్ కూడా అందిస్తున్నాం. పట్టభద్రలు సర్టిఫికేట్లు తీసుకుంటున్నప్పటికీ ఉద్యోగాలు లేవు. అందుకే యువత కోసం రాజీవ్ యువ వికాసం స్కీమ్‌ను తీసుకొచ్చాం. ప్రజలకు ఏ సమయంలో ఏది అవసరం ఉంటుందో కాంగ్రెస్ పార్టీకి బాగా తెలుసని'' సీఎం రేవంత్ అన్నారు. ఇక ఈ సమ్మిట్‌లో పలువురు మంత్రులు, కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు.      

Also Read: మీకు దండం పెడతా.. పిల్లలకు గుండె ఆపరేషన్లు ఉన్నాయి.. పాకిస్థానీ తండ్రి ఆవేదన!

telugu-news | rtv-news | national-news | Rahul Gandhi | cm-revanth-reddy

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు