/rtv/media/media_files/2025/04/26/EDkZjqgPESXcMtad7MUD.jpg)
Attack on pakistan
పహల్గాం ఉగ్రదాడి.. భారత్, పాకిస్థాన్ మధ్య ప్రకంపనలు రేపుతోంది. ఇరుదేశాల మధ్య ఇప్పటికే యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఏ క్షణంలో యుద్ధం జరుగుతుందో చెప్పలేం. అయితే తాజాగా ఓ కీలక అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. 48 గంటల్లో పాకిస్థాన్‌పై భారీ దాడి జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారత్‌కు మద్దతుగా రంగంలోకి ఇజ్రాయెల్ మొసాద్ టీం దిగినట్లు తెలుస్తోంది. అత్యాధునిక టెక్నాలజీ సాయం అందిస్తోందని.. పాకిస్థాన్‌లో భారీ విధ్వంసానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఐరన్ డోమ్ టెక్నాలజీని సైతం భారత్‌కు అందిస్తున్నట్లు తెలుస్తోంది. విదేశాల్లో స్పెషల్ ఆపరేషన్స్ నిర్వహించడంలో మొసాద్ టీం మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Also Read: ఏపీలో పాకిస్తాన్ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది - షాకింగ్ ఫ్యాక్ట్స్!
Indian Army Attack On Pakistan
మరోవైపు ఇండియన్ ఆర్మీ.. ఎక్స్‌లో సంచలన పోస్ట్ చేసింది. ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం అంటూ పేర్కొంటూ జవాన్లు విన్యాసం చేసే దృశ్యాలను షేర్ చేసింది. '' దేనికీ భయపడం, ఏదీ మమ్మల్ని ఆపలేదు, ఎప్పుడ సిద్ధమే అంటూ తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు తూర్పు నావికాదళం సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో విశాఖలో నేవీకి సన్‌రైజ్ ఫ్లీట్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. తూర్పు నావికాదళాధిపతి వైస్ అడ్మిరల్ పెందార్కర్ ప్రస్తుత పరిస్థితిని సమీక్షించారు. సముద్రమార్గంలో పెరుగుతున్న ఉద్రిక్తతలను దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచనలు చేశారు.
Always Prepared, Ever Vigilant - #IndianArmy pic.twitter.com/NIHWvWF9oM
— ADG PI - INDIAN ARMY (@adgpi) April 26, 2025
Also Read: చైనా సహాయం కోరిన పాక్.. భారత్తో ఏ క్షణమైనా యుద్దం!
అంతేకాదు ప్రస్తుతం అత్యవసర పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో యుద్ధ నౌకలు, సబ్ మెరైన్లలో పనిచేస్తున్న సిబ్బందికి సెలవులు రద్దు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు సముద్ర తీర ప్రాంతాల్లో భద్రతా బలగాల కదలికలపై తూర్పు నావికాదళాధిపతి (ENC) స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇక అరేబియా మహాసముద్రంలో భారత నౌకాదళం అత్యాధునిక ఎయిర్ క్రాఫ్ట్ కారియర్ ఐఎన్‌ఎస్ విక్రాంత్ మోహరించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read : అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్
Also Read : ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తను ఉరేసి లేపేసింది!
telugu-news | rtv-news | india-vs-pakistan | Pahalgam attack | India vs Pakistan War | action on pakistan