వార్తా సంస్థలకు సోషల్ మీడియా సంస్థలు డబ్బులు చెల్లించాల్సిందే: అశ్వినీ వైష్ణవ్ సోషల్ మీడియా వేదికలపై షేరైన, చదివే కంటెంట్‌కు ఈ సంస్థలు వార్తా సంస్థలకు డబ్బులు చెల్లించాలని కేంద్ర మంత్రి వైష్ణవ్ అన్నారు. ఈ చెల్లింపు న్యాయబద్ధంగా ఉండాలన్నారు. కంటెంట్‌ను సేకరించడం, జర్నలిస్టులకు వేతనాలు ఇవ్వడం వల్ల మీడియా సంస్థలకు చాలా ఖర్చవుతోందని తెలిపారు. By B Aravind 18 Nov 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి ఈరోజుల్లో సోషల్ మీడియా వాడని వారు ఎవరూ ఉండరు. ప్రతీరోజూ కూడా నెటిజన్లు యూట్యూబ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లకు కొంత సమయాన్ని కేటాయిస్తున్నారు. ఈమధ్య పేపర్లు, వార్తా ఛానళ్ల కంటే కూడా సోషల్ మీడియాలనే ఎక్కువగా వార్తలు తెలుసుకునే పరిస్థితులు వచ్చాయి. అయితే తాజాగా కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికలపై షేరైన, చదివే కంటెంట్‌కు ఈ సంస్థలు వార్తా సంస్థలకు డబ్బులు చెల్లించాలని అన్నారు. ఈ చెల్లింపు న్యాయబద్ధంగా ఉండాలన్నారు. జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. Also Read: పోటా పోటీగా మహారాష్ట్ర ఎన్నికలు.. అధికారంలోకి వచ్చేది ఎవరంటే ? రోజురోజుకు వార్తలు చదివే తీరు మారుతోందని.. ఈ క్రమంలోనే వార్తా సంస్థల డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి సోషల్ మీడియాకు మారిందని తెలిపారు. దీనివల్ల వార్తా సంస్థలకు నష్టం కలుగుతోందని అన్నారు. వార్తల సేకరణ, జర్నలిస్టలకు ట్రైనింగ్, వాళ్లకి జీతంతో పాటు సంబంధిత కంటెంట్‌కు ప్రజలకు అందించేందుకు సంప్రదాయ మీడియా సంస్థలకు పెద్ద మొత్తంలో ఖర్చు అవుతోందని మంత్రి తెలిపారు. అలాగే సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్‌లలో ఫేక్ వార్తలు, తప్పుడు సమచారాలకు ఆస్కారం ఎక్కువగా ఉందని, దీనిపై చర్చ జరగాల్సి ఉందని చెప్పారు. Also Read: ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం..107 విమాన సర్వీసులు ఆలస్యం! సోషల్ మీడియాలో వచ్చే సమచారం వల్ల కొన్నిసార్లు అల్లర్లు జరగడం, సమాజంలో శాంతికి విఘాతం కల్పించిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సదరు కంటెంట్‌కు సోషల్ మీడియా సంస్థలు బాధ్యత వహించడం లేదని తెలిపారు. ఇలాంటి వాటిపట్ల అప్రమత్తత అవసరం అన్నారు. సంప్రదాయ మీడియాలాగే సోషల్ మీడియాలు ఎందుకు బాధ్యత వహించకూడదు అని ప్రశ్నించారు. అంతేకాదు నెటిజన్లపై ప్రభావం చూపే కంటెంట్‌ను కూడా సోషల్ మీడియా అల్గారిథమ్ చూపించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. Also Read: రేవంత్ సర్కార్‌పై టాప్ సింగర్ సంచలన వ్యాఖ్యలు #telangana #telugu-news #social-media #ashwini-vaishnav మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి